అకాల వర్షాలు, వడగళ్ల వాన దెబ్బకు నష్టపోయిన రైతులకు కేసీఆర్ ఎకరానికి రూ. పది వేలు ప్రకటించారు. ఇన్ పుట్ సబ్సిడీ అని.. మరొకటి.. ఈ సీజన్ డబ్బులు ఈ సీజన్లోనే ఇస్తాననే కథలు చెప్పలేదు. అలా ఫీల్డ్ లోకి వెళ్లి పంట పొలాలలను పరిశీలిచారు. అక్కడ ప్రకటన చేశారు. ఆయన తిరిగి ప్రగతిభవన్కురాక ముందే రూ.228కోట్లను విపత్తు నిధి నుంచి మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
రైతులను ఆదుకోవాలని కేంద్రం దగ్గరకి పోయేది లేదని స్పష్టం చేశారు. తామే ఆదుకుంటామన్నారు. పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. మొత్తం 2 లక్షల 28వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాకు వచ్చారు. ఈ మొత్తానికి సరిపడా పరిహారం విడుదల చేశారు.
రైతులకు రైతు బంధు ఇస్తున్నారు. ఆ తరహాలోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కేసీఆర్ స్పందన రైతుల్ని సంతృప్తి పరిచింది. పంటల భీమా అని మరొకటి అని ఇబ్బంది పెట్టకుండా పరిహారం ఇస్తున్నారు. మూడు జిల్లాల్లో కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. భారీ నష్టం జరిగిందని.. అభిప్రాయపడ్డారు. నిజానికి పది వేల సాయం రైతులకు సరిపోదు కానీ.. మొత్తం నష్టపోయిన దశలో ఈ సాయం ఉపయోగపడుతుందని రైతులు సంతృప్తి పడుతున్నారు.