ఉగాదికి కొత్త సినిమా కబుర్లతో టాలీవుడ్ సందడిగా మారింది. కొత్తగా ప్రారంభమైన సినిమాలతో పాటు సెట్స్ పై వున్న చిత్రాలు వరుస అప్డేట్ లతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాయి. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం కొత్త కబురు అందలేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా సెట్స్ పై వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.
ఉగాది పండగ రోజున ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తారు. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. త్రివిక్రమ్ కి అ సెంటిమెంట్ వుంది. టైటిల్స్ అన్నీ అ తో మొదలయ్యేలా చూశారు. ‘అయోధ్య లో అర్జునుడు ‘అనే టైటిల్ ఈ సినిమాకి వినిపించింది. నిజానికి చాలా వెరైటీ టైటిల్ ఇది. అయోధ్యకి అర్జునుడి ఒక యుగం తేడా వుంది. రామాయణం, మహాభారతం రెండూ ఈ టైటిల్ లో వినిపించాయి. ఇది యూనిక్ టైటిలే.
కానీ ఇది త్రివిక్రమ్ కీ నచ్చలేదు. దిని కంటే బెటర్ టైటిల్ కోసం ఆయన చూస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఇంకా బెటర్ టైటిల్ తో రావాలనేది ఆయన ఆలోచన. మహేష్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.