సోషల్ మీడియా పోస్టులు పెడితే గతంలో అర్థరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేసేవారు. అంత అవసరం ఏముంది నోటీసు ఇస్తే వస్తారు కదా అని ఎవరికైనా డౌట్ వస్తే.. సీఐడీ పోలీసులు మాత్రం వికృతంగా నవ్వుతారు. వారి లక్ష్యం అరెస్ట్ చేయడం కాదు.. భయంకరంగా అరెస్ట్ చేయడం. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయో లేకపోతే సోషల్ మీడియా పేరుతో తప్పుడుకేసులు ఎక్కువైపోయాయని కంగారు పడుతున్నారో కానీ కేసులు పెట్టకుండా.. రిపోర్టులు కొడుతున్నారు.
ట్విట్టర్లో టీడీపీ నేతలు పెట్టే పోస్టులపై రిపోర్టులు కొట్టుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. సీఐడీ పోలీసుల నుంచి ఇలా రిపోర్టు వచ్చిందని .. కానీ మీ పోస్టును తాము రిస్ట్రిక్ట్ చేయడం లేదని.. గుర్తు చేస్తున్నామని సోషల్ మీడియా సంస్థలు ఆయా ఖాతాదారులకు తెలియచేస్తున్నాయి. వారు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి… సీఐడీ ఎలా అయిపోయింది అని జాలి చూపిస్తున్నారు. సీఐడీ పోలీసులు రిపోర్టులు కొడితే సోషల్ మీడియా సంస్థలు ఆయా ఖాతాలను బ్లాక్ చేస్తాయని అనుకుటంున్నారు.
కేసులు పెట్టడం దగ్గర్నుంచి రిపోర్టులు కొట్టుకుని టీడీపీ సోషల్ మీడియాను నియంత్రించడానికి సీఐడీ పోలీసుల్ని వాడుకునే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే సీఐడీని ఎలా వాడుకుంటారోనని కామెడీ చేస్తున్నారు.