విశ్వక్సేన్ నుంచి వచ్చిన మరో సినిమా `దాస్ కా ధమ్కీ`. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే వ్యవహరించాడు విశ్వక్. విడుదలకు ముందు ఈ సినిమాకి మంచి బేరం వచ్చింది. అవుట్ రేట్ రూ.20 కోట్లకు తీసుకోవడానికి ఓ బయ్యర్ ముందుకొచ్చాడు. కానీ తన సినిమాపై విశ్వక్‌కి ఉన్న అతి నమ్మకం వల్ల.. ఈ డీల్ కి ఒప్పుకోలేదు. డిజిటల్, శాటిలైట్ హక్కుల్నీ అమ్ముకోలేదు. రూ.12 కోట్లకు నాన్ థియేటరికల్ రైట్స్‌ని అమ్మదామని చూశాడు. కానీ ఓ ఓటీటీ సంస్థ రూ.8 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ విశ్వక్ మనసొప్పలేదు. తీరా సినిమా విడుదలై.. ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. ఈ సినిమాపై రివ్యూలన్నీ నెగిటీవ్‌గానే వచ్చాయి. కానీ విశ్వక్ చేసుకొన్న పబ్లిసిటీ, మాస్ లో తనకున్నక్రేజ్ వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. టాక్ కీ, వసూళ్లకీ సంబంధమే లేదు.కాకపోతే.. పెట్టుబడి మాత్రం తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రూ.20 కోట్ల బేరం వచ్చినప్పుడు అవుట్ రేట్ కి అమ్మేసినా, నాన్ థియేటరికల్ రైట్స్ రూ.8 కోట్లకు ఇచ్చేసినా.. విశ్వక్ ఈపాటికి గట్టెక్కేసేవాడు. కానీ.. అలా జగరలేదు. ఇప్పుడు నాన్ థియేటరికల్ రైట్స్ నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. రూ.6 కోట్లకు ఇచ్చేద్దామన్న కొనడానికి ఓటీటీ ముందుకు రావడం లేదు.