అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఆరు నెలల సమయం తీసుకుని తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రాత్రికి రాత్రి విచారణ జరిపించేసుకోవాలని తాపత్రయ పడుతున్న జగన్కు ఏదీ కలసి రావడం లేదు. ఆయన ఎంత తొందరగా విచారణ జరగాలని కోరుకుంటే.. అంత ఆలస్యమవుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి ఈ రోజు విచారణకు వస్తే.. వెంటనే జూలై 11వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వ లాయర్లు ఉసూరుమన్నారు.
తీర్పుపై స్టే కోసం అదే పనిగా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంతకు ముందే కేంద్రం దాఖలు చేసిన అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. చివరకు విచారణ జూలైకు వాయిదాపడింది. ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ కేఏం జోసెఫ్ జూన్లో పదవీ విరమణ చేయనున్నారు.
అంతకు ముందు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారింది. పదో నెంబర్ గా ఉన్న అణరావతి కేసు అంతకంతకూ ఆలస్యమయింది. ఇతర నెంబర్ల కేసులుకూడా విచారణకు వచ్చాయి. దీంతో అమరావతి రాజధాని కేసు ఉండటంతో విచారణకు రాదేమోనని అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ ప్రభుత్వ లాయర్లు ప్రయత్నించారు. ఈ సందర్బంగా లాయర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.