అమలాపురం అల్లర్ల లో కేసులు మొత్తం ఎత్తి వేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఈ అల్లర్ల కేసుల్లో ఇరుక్కున్న కొంత మంది .. ఆయా సామాజికవర్గాల వారు జగన్‌ను కలిసి సన్మానం చేశారు. ఎలాంటి న్యాయపరమైన వివాదాలు రాకుండా కేసులు ఎత్తి వేయాలని సీఎం జగన్ .. సీఎంవో వ్యవహారాలు చక్కబెట్టే ధనుంజయ్ రెడ్డిని అప్పటికప్పుడు ఆదేశించారు. అయితే ఈ కేసు ఎత్తివేత అంశం సొంత పార్టీతో పాటు ఇతర వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
అమలాపరం అల్లర్లలో దాడులు చేశారని చెప్పి వందల మందిపై కేసులు పెట్టారు. ఇలా దాడులకు గురైంది మంత్రి పినిపె విశ్వరూప్‌తో పాటు ఇతర వైసీపీనేతలు. వారి ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే సీఎం జగన్ వారిని కనీసం పరామర్శించలేదు. పినిపే విశ్వరూప్ తర్వాత అనారోగ్యంతో నెలల తరబడి ఆస్పత్రి పాలైనా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదు. కోలుకుని వచ్చిన తర్వాత కూడా ఆయనను పార్టీ పట్టించుకోనట్లే ఉంది. ఇప్పుడు ఆయన ఇళ్లపై దాడులు చేసిన వారి కేసులు ఎత్తి వేయించి వారితో సీఎం సన్మానాలు చేయించుకుంటున్నారు. దీంతో దళిత సంఘాలు భగ్గు మంటున్నాయి.
అసలు అమలాపురం అల్లర్లలో దాడులు చేసింది టీడీపీ, జనసేన వాళ్లేనని అప్పట్లో విస్తృతంగా ప్రచారం చేశారు వైసీపీ నేతలు. చివరికి వారంతా వైసీపీతో సన్నిహితంగా ఉన్న వారేనని తేలింది. అక్కడ వర్గ పోరు… వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలతే ఈ గొడవలు పెరిగాయని చెబుతున్నారు. మొదట్లో దూకుడుగా అదంర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు తరవాత కేసు విషయంలో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కేసులు ఎత్తి వేయించి సన్మానాలు చేయించుకుంటున్నారు. మొత్తంగా అన్యాయమైపోయింది మాత్రం జగన్ కేబినెట్లో సొంత మంత్రి.