నాని ‘దసరా’ సినిమా తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ. తను చిన్నపటి నుంచి విన్న ఒక సంఘటన స్ఫూర్తిగా ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్. అయితే ఈ సినిమాలో నటీనటులంతా తెలుగు వాళ్ళే వుండాలని తొలుత భావించాడట. ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాలనేది శ్రీకాంత్ ఆలోచన. అయితే నాని మాత్రం తెలుగు అమ్మాయిలు దొరకరని ముందే చెప్పారట. చివరికి నాని మాటే నెగ్గింది.
ఈ విషయం గురించి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. దసరాలో వెన్నెల పాత్ర కోసం ఓ తెలుగు అమ్మాయి అయితే బావుంటుదని కథ రాసుకునప్పుడే అనుకున్నాను. ఇదే సంగతి నాని గారికి చెప్పాను. ఆయన నాకు కావాల్సినంత సమయం ఇచ్చారు. దాదాపు ఎనిమిది నెలలు తెలుగు అమ్మాయి కోసం తిరిగాను. ఒక్కరు కూడా ఆ పాత్రకు సరిపోతారని అనిపించలేదు. ఎంతవెదికినా దొరకలేదు” అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.
ఇక కీర్తి సురేష్ గురించి చెబుతూ.. కీర్తిది సూపర్ బ్రెయిన్. ఎంత కష్టమైన విషయాన్ని కూడా సులువుగా అర్ధం చేసుకొని మనకు కావాల్సినట్లుగా అభినయిస్తుంది. ఎక్కడా ఒత్తిడి తీసుకున్నట్లు కనిపించదు. వెన్నెల పాత్రలో ఆమెని తప్పితే మరొకరిని ఊహించడం కష్టం అన్నట్లుగా నటించిదని కితాబిచ్చాడు.