ఆయన సీనియర్ ఐఏఎస్ … చివరికి ప్రభుత్వం చెప్పినట్లుగా చేసి హైకోర్టు చేత దొంగ అనిపించుకున్నారు. ఇంత కన్నా ఓ సీనియర్ ఐపీఎస్‌కు అవమానం మరొకటి ఉండదు. ఆ సీనియర్ ఐఏఎస్ పేరు హరి జవహర్ లాల్. ఆయన చేసిన తప్పు కళ్ల ముందే ఉంది. హైకోర్టు ఆక్షేపించింది కానీ… దీనిపై నిజంగా విచారణ చేస్తే ఆయన జైలుకెళ్తారు. అది తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందేమో కానీ ఇప్పుడు అయితే హైకోర్టు చేతే దొంగ అనిపించుకున్నారు.
గుంటూరులోని ఓ ఆలయానికి దాతలు ఇచ్చిన రెండెకరాల స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టడానికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారి హోదాలో ఎన్వోసీ జారీ చేశారు. నిషేధిత భూముల నుంచి తప్పించారు. దీని వెనుక అధికార పార్టీ మాఫియా ఉంది. వారి ఒత్తిడితోనే ఆయన ఈ పని చేశారు. నిజానికి ఇలా ఉత్తర్వులిచ్చే అధికారం ఆయనకు లేదు. ఆ విషయం ఆయనకు తెలుసు కూడా. కానీ వైసీపీ పెద్దలతో కుమ్మక్కయి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు కోర్టు ముందు దోషిగా నిలబడ్డారు. దొంగ అనిపించుకున్నారు.
ఏపీలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఇలా తమ చేతుల్లో లేని అధికారాలను ఉపయోగించి వైసీపీ నేతల అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు వెలుగుచూస్తూనే ఉన్నాయి . ప్రభుత్వం మారితే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్‌లు ఎంతో మంది జైలు బాట పట్టాల్సి ఉంటుందన్న చర్చ అధికారవర్గాల్లోనే జరుగుతోంది. ముందుగా కోర్టు నుంచి చీవాట్లు వస్తున్నాయని… కానీ ప్రభుత్వం మారితే బాధిత వర్గాలు సైలెంట్ గా ఉండవు కదా అనే అభిప్రాయం వినిపిస్తోంది.