పాన్ ఇండియా సినిమాగా వచ్చింది దసరా. విడుదలకు ముందే నాని నార్త్ లో కూడా ప్రచారం చేశారు. దసరా కి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పోల్చుకుంటే నార్త్ లో బాక్సాఫీసు కొంచెం స్లోగా వుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని నాని దగ్గర ప్రస్తావిస్తే చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నేనేం అమితాబ్ బచ్చన్ కాదని నవ్వేశారు.
”నార్త్ లో రెస్పాన్స్ బావుంది. మంచి రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చిన ఓపెనింగ్స్ కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది. అయితే తెలుగుతో పోలిక పెట్టి చూడటం సరికాదు. అక్కడ నేనేం అమితాబ్ బచ్చన్ కాదు కదా” అని చెప్పుకొచ్చారు నాని.
నాని సమాధానం బావుంది. నాని మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అక్కడ నాని కొత్త. మౌత్ టాక్ తోనే రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగుతుంది కానీ తెలుగ వసూళ్ళకు నార్త్ కి పోలిక పెట్టడం సరికాదు.