ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు చెప్పుకుందాం అనే కార్యక్రమాన్ని పదమూడో తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ నాలుగేళ్లుగా ఎవరికి చెప్పుకున్నా ఏమీ జరగడం లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అందుకే నేరుగా సీఎంకు చెప్పుకోండి అని ప్రజలకు ఆఫర్ ఇస్తున్నారు. నిజానికి ఇది ఓటర్లను ట్రాప్ చేసే పెద్ద వ్యూహం. గతంలో వైఎస్ఆర్ కుటుంబం పేరుతో మిస్డ్ కాల్స్ తీసుకుని అధికారంలోకి రాగానే అన్నీ చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా జగనన్నకు చెప్పుకుందాం ప్రారంభిస్తున్నారు. ఇది పూర్తిగా ఐ ప్యాక్ ఐడియా. బెంగాల్ లో ఇప్పటికే అమలు చేశారు.
దీదీకో బోలో పేరుతో ఐ ప్యాక్ ఈ కార్యక్రమాన్ని… బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించింది.. నేరుగా అక్కడి సీఎం మమతా బెనర్జీ రికార్డెడ్ వాయిస్ వినిపిస్తోంది. ఇక్కడా అదే్. ఇది కాల్ సెంటర్ లాంటిది. కార్పొరేట్ కంపెనీల కస్టమర్ కేర్ తరహాలో వారిచ్చిన కంప్లైంట్ ను .. పరిష్కరించే ప్రాసెస్ జరుగుతుంది. మన సమస్యకు సంబంధించిన టికెట్ ఇష్యూ చేస్తారు. టికెట్ ఏ స్టేజ్ లో ఉందో.. ప్రజలకే తెలుస్తుంది. ఫాలోఅప్ ఎంత వరకూ అయిందనేది ఉంటుంది. ఇష్యూ రిజాల్వ్ అయితే అయిపోయిందని మెసేజ్ వస్తుంది. అవ్వకపోతే.. అలాగే చూపిస్తుంది.
కాల్ చేస్తే.. ఫస్ట్ జగన్ వాయిస్ వస్తుంది. మీ సమస్య ఏంటో చెప్పమని జగన్ చెప్పే ఇంటారాక్టివ్ వాయిస్ ఉంటుంది. వాళ్లు ఐవీఆర్ఎస్ లో అన్నీ చూజ్ చేసుకున్నాక.. మళ్లీ జగన్ వాయిస్ లో దీన్ని మా విభాగం వాళ్లకి పంపుతున్నాను అనే వాయిస్ వస్తుంది. ఆ తర్వాత.. సంబంధిత సిబ్బందికి ఫోన్ బదిలీ అవుతుంది. దీని ద్వారా పబ్లిక్ తో నేరుగా కనెక్ట్ అవ్వొచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రే నేరుగా మాట్లాడుతూ భరోసా కల్పించిన భావన ప్రజలకు కలుగుతుందని అనుకుంటోంది.
కానీ రికార్డెడ్ వాయిస్లేక జనం పడిపోయే స్టేజ్ దాటిపోయారని… జనాన్ని కలవకుండా ఇలా రికార్డెడ్ వాయిస్‌లతో ఏమార్చే ప్రయత్నాలు వర్కవుట్ అవవని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.