అల్లు అర్జున్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న అప్డేట్ కి సంబధించిన ప్రోమో వచ్చింది. ‘పుష్ప: ది రూల్’ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబధించిన ప్రోమో వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.
‘’ తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. అసలు పుష్ప ఎక్కడ ?’ అని న్యూస్ వాయస్ ఓవర్ లో కొన్ని ఆసక్తికరమైన విజువల్స్ పోస్ట్ చేశారు. బైక్ పై పారిపోవడం, పెద్ద ఎత్తున నిరసనలు.. ఈ ప్రోమోలో కనిపించాయి. పూర్తి వీడియో ఏప్రిల్ 7 సాయంత్రం నాలుగు గంటలుకు విడుదల చేస్తారు.
‘పుష్ప: ది రైజ్’ సినిమాకు కొనసాగింపుగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్థాయి నుంచి ఆ సిండికేట్ నడిపే వరకూ పుష్పరాజ్ ఎలా ఎదిగాడో ‘పార్ట్1’లో చూపించారు. తన చుట్టూ ఉన్న ప్రత్యర్థులు, శత్రువులను దాటుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ ఎలా రూల్ చేశాడనేది ‘పార్ట్2’లో చూపించనున్నట్లుగా తెలుస్తోంది.