అధికార వైఎస్ఆర్సీపీకి .. టీడీపీ ఇచ్చే సెల్ఫీ చాలెంంజ్లకు సమాధానం చెప్పడానికి ఫేక్ ఎడిట్ లు మాత్రమే దిక్కవుతున్నాయి. టీడీపీ కంటే గొప్పగా చేశామని చెప్పుకోవడానికి వారి వద్ద సరుకు ఉండటం లేదు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైనపప్పటి నుంచి సెల్ఫీ చాలెంజ్‌లు విసురుతున్నారు. తాజాగా నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద చంద్రబాబు విసిరిన చాలెంజ్ తో ఈ అంశం సంచలనగా మారింది. దీనికి వైసీపీ ఫేక్ ఎడిట్లతో విరుచుకుపుతోంది. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి గతంలో ఓ పోస్టర్ పట్టుకుని దిగిన ఫోటోకు.. మా నమ్మకం జగన్ అనే పోస్టర్ యాడ్ చేసి సర్యూలేట్ చేసుకుని వైసీపీ సోషల్ మీడియా సంతోషపడింది.
అలాగే లోకేష్ తాము తెచ్చిన కంపెనీల జాబితాతో పెద్ద లిస్ట్ పోస్టర్ గా చూపిస్తున్న ఫోటోను కూడా అలాగే ఎడిట్ చేసుకుని స్వయంతృప్తి పొందారు. కానీ అసలు టీడీపీ నేతలు ఇస్తున్న సెల్ఫీ చాలెంజ్‌లకు మాత్రం వారి వద్ద సమాధానం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని గత నాలుగేళ్లుగా జరగలేదు. వైసీపీ హయాంలో వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. అందుకే ఎవరూ సెల్ఫీల చాలెంజ్ లో పాల్గొనలేకపోతున్నారు. దీనికి కౌంటర్ గా … ఫేక్ ఎడిట్లతో రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి పరిణామాలు సహజంగానే వైసీపీ సోషల్ మీడియా ఇంత నిర్వీర్యం అయిపోయిందా అన్న అభిప్రాయానికి వచ్చేలా చేస్తున్నాయి.
చంద్రబాబు, లోకష్ సెల్ఫీ చాలెంజ్ లకు ప్రభుత్వ పరువు నిలబడేలా కౌంటర్లు ఇవ్వాలి కానీ.. అలాంటిదేమీ లేకుండా ఫేక్ పోస్టులు చేసుకుంటే ప్రజల్లో చులకన అవుున్నామన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఉంది. తమ లక్ష్యం అభివృద్ధి కాదని సంక్షేమమేనని.. సంక్షేమం వల్ల బాగుపడిన జీవితాలను చూపించి… కౌంటర్ ఇవ్వాలంటున్నారు. అయితే ఇప్పుడు పథకాలు అందని వారే ఎక్కువ. జగన్ మీట నొక్కుతున్నా అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు. దీంతో వైసీపీ నేతలు ఉదాహరణగా చెప్పుకోవడానికి ఒక్కటీ దొరడం లేదు. చివరికి దొరికిపోయే ఫేక్ ఎడిట్లకు పరిమితమవుతున్నారు.