ఏపీ రాజకీయాల్లో పరకాల ప్రభాకర్ మాస్ లీడర్ కాదు. అసలు ఆయన లీడర్ కానే కాదు. పీఆర్పీలో లీడర్ గా చేశారు. ఆ సమయంలో ఆయన ప్రజా రాజ్యం పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి … చిరంజీవిపైనే విమర్శలు చేసి… అక్కడే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అప్పుడే ఆయనకు కనీస వాల్యూస్ లేవన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు ఉండటం… బీజేపీ తరపున నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉండటంతో… ఆయన ఎలా లాబీయింగ్ చేసుకున్నారో కానీ ఏపీ ప్రభుత్వ సీపీఆర్వోగా చేరిపోయారు.
అయితే ఆయన రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదు. హఠాత్తుగా ఇప్పుడు ఆయన బూతులతో విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు సహజమే. అలా కొంత మంది ఫ్యాన్ వార్ చేసుకుంటున్న సమయంలో … వారిలో కొంత మంది కావాలని పరకాల ప్రభాకర్ ను టార్గెట్ చేశారు. నిజానికి పరకాల… ప్రజారాజ్యం ఇన్నింగ్స్ గురించి ఎప్పుడూ ప్రచారంలోకి రాలేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రజారాజ్యంలో ఏమి చేశారో హైలెట్ అవుతోంది. ఆయనను బండ బూతులు తిడుతున్నారు. ఇదంతా కొన్ని ఫేక్ అకౌంట్లతో కావాలని చేయిస్తున్నారని.. ఆయనను రెచ్చగొట్టేలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పరకాల ప్రభాకర్ ఇలా తనను తిట్టిన ట్విట్టర్ అకౌంట్కు అత్యంత అసభ్యంగా సమాధానం ఇచ్చారు. ఆ స్థాయి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడతారని ఎవరూ అనుకోలేదు. అందుకే అకౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. కావాలని రాశానని.. మరో ట్వీట్ చేశారు. అందులో మరోసారి విమర్శలు గుప్పించారు. పరకాలను.. ఐ ప్యాక్ టీం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ప్రజా రాజ్యం మొదట్లో చిరంజీవితో ఉండి తర్వాత ఎన్నికల కంటే ముందు ఆయనపై తీవ్రంగా విమర్శించి వెల్లిపోయింది కేవలం పరకాల మాత్రమే కాదు.. కేశినేని నాని, డాక్టర్ సమరం సహా చాలా మంది ఉన్నారు. అయినా పరకాలను టార్గెట్ చేసుకుంటూడటం.. ఆయన బ్యాలెన్స్ తప్పడం కొత్త వివాదానికి దారి తీస్తోంది.