బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ తొలి విజయం సాధించారు. అయితే అది ఆయన నేరుగా సాధించలేదు. అభ్యర్థికి మద్దతిచ్చారు ఆయన గెలిచారు. బీహార్లో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఫాక్ అహ్మద్ అనే అభ్యర్థి విజయం సాధించారు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీ జన సురాజ్ పార్టీ మద్దతు పలికింది. ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీ చట్టసభల్లోకి అడుగు పెట్టినట్లయిందన్నప్రచారం ఊపందుకుంది.
ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎలా గెలవాలో ప్రశాంత్ కిషోర్ కు బాగా తెలుసని.. ఆయన వ్యూహాలు పని చేశాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎలా గెలిచినా గెలుపే .. వచ్చేది ప్రచారమే కాబట్టి.. దీనిపై బీహార్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ పేరుతో వచ్చే ఎన్నికల్లో బీహార్ లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన బీజేపీ బీటీం అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ తరచూ నితీష్ ను టార్గెట్ చేస్తూ ఉంటారు. బీజేపీ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తూంటారు
రాజకీయ వ్యూహకర్తగా తెర వెనుక రాజకీయాల్లోకి వచ్చిన పీకే… అలియాస్ ప్రశాంత్ కిషోర్ .. తర్వాత నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. జేడీయూలో చేరారు. ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. కానీ ఆయన నితీష్ రాజకీయాలు తట్టుకోలేక బయటకు వచ్చారు. మళ్లీ స్ట్రాటజిస్టుగా పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ బీహార్ లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. పాదయాత్రకు అయ్యే ఖర్చు అంతా తన క్లైంట్లు పెట్టుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. హంగూ ఆర్భాటాలతో ఆయన పాదయాత్ర సాగుతోంది.