సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని దోచుకోవడానికి కొంత మంది పెత్తందారుల్ని ప్రత్యేకంగా పెట్టారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే పులివెందుల కంపెనీకి ఎవరు అసలైన యజమానులో కానీ.. ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసుకునే ఈ కంపెనీ లక్షల కోట్లు పెట్టుబడులు పడతామని చెబుతోంది. అంత సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయో కానీ ప్రభుత్వం నుంచి మాత్రం వేల కోట్ల కాంట్రాక్టులు లభిస్తున్నాయి. ఇలాలభించిన కాంట్రాక్టు స్మార్టు మీటర్ల బిగింపు.
విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఈ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ తోపాటు రాఘవ కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ కూడా ఈ పెత్తందారుల జాబితాలో చేరింది. ఇది తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినది. ఈ కంపెనీకి ఏపీలో వేల కోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి. అసలు ఈ కంపెనీకి మీటర్లు పెట్టడానికి సంబంధమే లేదు.. కానీరూ. రెండు వేల కోట్లు విలవైన కాంట్రాక్టును ఆ కంపెనీకి కట్టబెట్టేశారు. అయనకు ఏపీలో ఇదే మొదటి కాంట్రాక్ట్ కాదు.
మైనింగ్ సీవరేజీ వసూలు కాంట్రాక్టులు.. కీలకమైన జిల్లాల్లో పొంగులేటికి.. ఆయన కుటుంబానికి చెందిన వారికే దక్కాయి. మైనింగ్ శాఖ… సీవరేజీ వసూలును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. మైనింగ్ ఎక్కువ జరిగే సీమ ప్రాంతంలో… సీవరేజీ వసూలు టెండర్లు పొంగులేటి కంపెనీలకే దక్కాయి. రాఘవ కన్ స్ట్రక్షన్స్ అనే ఓ కంపెనీతో పాటు… టెండర్లు పిలిచిన తర్వాత పొంగులేటి ఫ్యామిలీ కొడుకులు, కూతుళ్ల పేరుతో ఏర్పాటయిన కంపెనీ కి కూడా ఓ కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిన్నామొన్నటిదాకా తాను ఉన్న బీఆర్ఎస్ పార్టీ లో ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కానీ ఏ పార్టీలో చేరేది చెప్పడం లేదు. కానీ ఖమ్మం మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారు.