సీఎం జగన్ తనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడికేసులో సాక్ష్యమివ్వడానికి కూడా కోర్టుకెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. తనపై దాడి జరిగిందని పెద్ద ఎత్తున డ్రామా చేసిన ఆయన. .. అదో పెద్ద కుట్ర అని రాజకీయ సీరియల్ నడిపారు. కానీ ఇప్పుడు కుట్రదారుల్ని.. పాత్ర దారులపై శిక్ష పడే అవకాశాన్ని ఆయన ఆలస్యం చేస్తున్నారు. బాధితుడి వాంగ్మూలం నమోదు చేయడానికి కోర్టుకు వాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు చెబుతోంది. కానీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. సోమవారం జరగాల్సిన విచారణకు సీఎ జగన్ వెళ్లడం లేదు.
ఎన్ఐఏ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సాక్ష్యం నమోదు పత్రాన్ని దాఖలు చేశారు. సీఎం జగన్ రెడ్డి హాజరు కానీదే విచారణ ముందుకు సాగదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఈ కేసు గురించి భిన్నమైన ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు శీను వద్ద కోడికత్తి దొరకలేదని చెబుతున్నారు. అందుకే కోడికత్తిని ఎన్ ఐఏ కూడా కోర్టు ముందు పెట్టలేకపోయింది. . జగన్ కు అయినట్లుగా చెబుతున్న ాగయం అసలు గాయం కాదని.. అది షర్టపై అంటిన సాస్ అన్న ప్రచారం జరుగుతోంది.
అయితే తనకు గాయం తగిలిందని జగన్ మూడు వారాల ట్రీట్ మెంట్ తీసుకున్నారు అది వేరే విషయం. ఇదంతా దర్యాప్తులో తేలాలి. నిందితుడు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయన బయటకు రాలేదు. కనీసం బెయిల్ ఇవ్వడానికి కూడా సీఎం జగన్ సహకరంచడం లేదని కోడికత్తి శీను తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తంగా తన అక్రమాస్తుల కేసులో విచారణు ఎలా ఆలస్యం చేసుకుంటున్నారో అలాగే కోడి కత్తి కేసునూ ఆలస్యం చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.