బైజూస్‌కు స్పెషల్ బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ప్రమోట్ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ కంపెనీ పేరు ఎత్తడం లేదట. విద్యాశాఖ సమీక్షల్లో గతంలో మొత్తం బైజూస్ జపం చేయడాన్ని చాలా మంది చూశారు. కానీ ఇప్పుడు బైజూస్ అనే పేరు ఎత్తడానికి సీఎం జగన్ ఇష్టపడటం లేదు. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో మరో సంచలనాత్మక విషయం బయటకు వచ్చింది. అసలు బైజూస్ కంటెంట్ ను వద్దనుకుంటున్నారట. అసలు ట్యాబ్ ల కోసమే ఖర్చుపెడుతున్నామని కంటెంట్ అంతా బైజూస్ ఉచితంగా ఇస్తోందని.. ఇది 750 కోట్ల వరకూ ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో వచ్చే ఉచిత కంటెంట్ ను ఎందుకు వద్దనుకుంటున్నారో మాత్రం తెలియదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కంటెంట్ తయారు చేస్తారట.నిజానికిఈ బైజూస్ కంటెంట్ గురించి ఎవరికీ సదభిప్రాయం లేదు. కరోనా టైంలో బాగా ఎదిగిన కంపెనీఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆ కంపెనీ కంటెంట్‌లో మ్యాటర్ లేదన్న ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తోంది. ఇలాంటి సమయంలో దావోస్ వెళ్లినప్పుడు సీఎం జగన్ వ..బైజూస్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఇండియాకురాగానే… బైజూస్ తో ఒప్పందం గురించి ప్రకటించారు.
ఒక్క సారి ట్యాబ్‌లు ఇచ్చే సరికి బైజూస్ పై సీఎంజగన్ కోసం వచ్చింది. తెర వెనుక అసలేం జరిగిందన్న దానిపై అమరావతిలో.. విద్యాశాఖలో చాలా చిత్ర విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందాలనుబై జూస్ రవీంద్రన్ పాటించడం లేదన్న కోపం జగన్ లో ఉందంటున్నారు. అసలే ఆర్థిక కష్టాల్లో రవీంద్రన్.. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మతో కాస్త బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒప్పందాలను ఉల్లంఘించడంతో సీఎంజగన్ కు కోపం వచ్చిందని.. అందుకే సొంత కంటెంట్ తయారుచేయాలని ఆదేశించిట్లుగా ప్రచారం జరుగుతోంది.