చనిపోయిన వైఎస్ వివేకానందరెడ్డిని విలన్ గా చూపించి ఆయనను చంపడం తప్పు కాదని ఎలాగైనా నిరూపించాలని తెగ తాపత్రయ పడిపోతోంది వైఎస్ అవినాష్ రెడ్డి బ్యాచ్. కొత్తగా వివేకా మీదమరో నింద వేశారు. అదేమిటంటే సునీల్ యాదవ్ తల్లిని వివేకానందరెడ్డి లైంగికంగా వేధించారట. అది తట్టుకోలేని సునీల్ యాదవ్ ఆయనను దారుణంగా హత్య చేశారట.ీ విషయాలను తెలంగాణ హైకోర్టులో లాయర్ నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. నిజానికి సోమవారం విచారణలో ఇవేమీ చెప్పలేదు. సోమవారం ప్రకాష్ రెడ్డి అనే లాయర్ వచ్చారు. ఈ రోజు కొత్త కథ చెప్పడానికి రాజ్యసభ సభ్యుడు కూడా అయిన నిరంజన్ రెడ్డి వచ్చారు.
ఇప్పటి వరకూ ఈ కథను వైసీపీ నేతలు వెల్లడించలేదు. వైఎస్ వివేకానందరెడ్డి ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారని.. ఓ బిడ్డను కన్నాడని గట్టిగా పదేళ్లు కూడా నిండని ఆ కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటించారని.. అందుకే కక్ష గట్టి కుమార్తె, అల్లుడు హత్య చేశారని వాదిస్తున్నారు. కానీ ఈ వాదనల్లో అంత పస లేదని.. కామెడీ అయిపోతున్నామని అనిపించిందేమో కానీ.. వెంటనే .. మరో కథతో రెడీ అయిపోయి వచ్చారు. జైల్లో ఉన్న నిందితుడు సునీల్ యాదవ్ తల్లిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ.. వివేకా క్యారెక్టర్ పై మరక వేస్తూ కొత్త కథను వండిస్తున్నారు.
సునీల్ యాదవే హత్య చేసి ఉంటే.. అంత ధైర్యంగా వైఎస్ కుటుంబానికి అంత సన్నిహితంగా ఎలా ఉంటారన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియని విషయం. వైఎస్ కుటుంబంలో ఎవరిపైనా కనీసం చెయ్యేత్తే ధైర్యం ముఖ్యంగా వారి కాలనీలోకి వెళ్లి వారి కుటుంబసభ్యుడ్ని చంపే ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం సునీత హత్య అంశాన్ని ఇతరులపై తోసేయడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. అందు కోసం చివరికి వివేకా కుమార్తె ను టార్గెట్ చేశారు.. ఇప్పుడు నిందితుడు సునీల్ యాదవ్ తల్లి గురించికథలు చెబుతున్నారు. ఎలాగూ నిందితులు అరెస్టయ్యారు కాబట్టి.. సునీల్ యాదవ్ మీదకు తోసేసి తాము బయటపడాలని అనుకుంటున్నట్లుగా ఈ వాదన ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే ఇలా విచారణ జరగకుండా.. తేల్చకుండా పిటిషన్లు వేస్తూ కొత్త కొత్త కథల్ని ప్రచారంలోకి తెస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. ముందు ముందు ఇంకెన్ని కథలు వినాలో.