ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ గెటప్.. తన క్యారెక్టరైజేషన్ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సిరీస్‌లో రాబోతున్న ప్రభాస్ సినిమాల్లో మారుతి సినిమా అన్ని విధాలా రిఫ్రెషింగ్ గా ఉండబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ కూడా… ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. `రాజా డీలక్స్` అనే పేరు బయట చక్కర్లు కొడుతోంది కానీ… ఆ టైటిల్ కీ ఈ కథకూ సంబంధమే లేదు.
అయితే ఈ సినిమా కోసం మారుతి ఇప్పటికే 3 పవర్‌ఫుల్ టైటిల్స్ రెడీ చేసుకొన్నాడు. టైటిల్స్ లోగోలతో సహా డిజైన్ చేసి ప్రభాస్ ముందు పెట్టారు. అవి మూడూ ఇంగ్లీష్ టైటిల్సే. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా. అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ తో సినిమాని విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ టైటిల్ కే చిత్రబృందం మొగ్గు చూపించింది. 3 టైటిల్స్ కూడా ప్రభాస్ కి నచ్చేశాయి. వాటిలో ఒకటి ఫిక్స్ చేస్తే… త్వరలోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని, అధికారికంగా ప్రకటించడానికి చిత్ర బృందం ఎదురు చూస్తోంది.ఆదిపురుష్ త్వరలోనే విడుదల కానుంది. వచ్చే వారం నుంచి ప్రమోషన్లు జోరందుకోబోతున్నాయి. ఆ హడావుడి అయిపోయిన తరవాతే… టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.