విశాఖ రామానాయుడు స్టూడియోను కూడా వైసీపీ నేతులు కబ్జా చేసేశారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజం అని తేలిపోయింది. రామానాయుడు స్టూడియోకు కేటాయించిన స్థలంలో దాదాపుగా పదిహేను ఎకరాలు లే ఔట్ గా మార్చి ఇళ్లు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అన్నీ రహస్యంగా జరిగిపోయాయి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అవి స్టూడియోకు కేటాయించిన స్థలాలు. అక్కడ ఇళ్ల నిర్మాణం చట్ట విరుద్ధం. అలా చేస్తే వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ అన్నీ ప్రభుత్వ అనుమతులు పక్కాగా వచ్చేశాయి. సురేష్ బాబు పేరు మీదనే ఇళ్ల నిర్మాణం.. లే ఔట్ వేస్తున్నారు. కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చారని అధికారులు అంటున్నారు.
అన్నీ సురేష్ బాబు పేరు మీదనే జరుగుతున్నప్పటికీ.. అసలు సురేష్ బాబుకు ఇందులో ప్రమేయం లేదని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తెర వెనుక బెదిరింపులతో ఈ వ్యవహారం నడుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు రామానాయుడు స్టూడియోను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆ స్టూడియోను చూసి వైఎస్ భారతి రెడ్డి మనసు పడ్డారని.. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించారని అయ్యన్నపాత్రుడులాంటి వాళ్లు చాలా సార్లు చెప్పారు. గతంలో స్టూడియో ను స్వాధీనం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రక్రియ ఏమయిందో కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు సురేష్ బాబు పేరు మీదనే లే ఔట్లు ఆయన ప్రమేయం లేకుండానే పడిపోతున్నాయి.
ఈ విషయంలో రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు ఎక్కడా ప్రకటనలు చేయలేదు. తమ స్టూడియో స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంకు మార్చామని ఆయన చెప్పలేదు. గతంలో టిక్కెట్ల వివాదం జరిగినప్పుడు సురేష్ బాబు ఓ సందర్భంలో మాట్లాడుతూ..” తాను ఏపీలో సినిమాలు రిలీజ్ చేసుకోనని.. ధియేటర్లను కూడా మూసేస్తానని.. స్టూడియో విషయంలో న్యాయపోరాటం ” చేసుకుంటాను కానీ లొంగిపోయే ప్రసక్తే లేదన్నట్లుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన లొంగిపోయి.. స్టూడియోలో స్థలం ధారదత్తం చేసి చివరికి బినామీగా ఉండటానికి కూడా అంగీకరించినట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.