దళితుల్ని పావులుగా వాడుకోవడం… రాజకీయ నిచ్చెనలు ఎక్కడం.. తర్వాత వారిని నడి రోడ్డుపై వదిలేయడం.. ఇదీ వైఎస్ జగన్ రాజకీయ శైలి. కోడి కత్తి డ్రామా వ్యవహారంలో జగన్ ఎంతో ఇష్టపడి వేయించుకున్న ఎన్ఐఏ దర్యాప్తులోనే అసలు విషయం వెల్లడి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. అసలు జగన్ కు ఎలాంటి గాయం కాలేదని.. ఇప్పుడు వెల్లడి అవుతోంది. అయనకు గాయం అయినట్లుగా విశాఖ ఎయిర్ పోర్టు వైద్యులు తేల్చలేదు.
కోడికత్తితో శ్రీనివాసరావు దాడి చేశారని ఆరోపించి… జగన్ చొక్కాకు ఎర్ర రంగు ఉన్న ఫోటోలు విడుదల చేసి ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి… అక్కడ ఆస్పత్రిలో చేరిపోయి.. మూడు వారాల పాటు ఓ రేంజ్ లో డ్రామా ఆడారు. నిజానికి ఆయన చొక్కా కూడా చిరగలేదని శ్రీనివాసరావు తరపు లాయర్లు చెబుతున్నారు. చొక్కా చిరగకుండా కోడికత్తి గుచ్చుకోవడం ఎలా సాధ్యం ? . అసలు కోడికత్తి కూడా ఎవరికీ కనిపించలేదు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత ఓ వైసీపీ కౌన్సిలర్ తెచ్చిచ్చాడు. ఎలా చూసినా ఇది మొత్తం స్క్రిప్టెడ్ వ్యవహారం అని.. విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరాలు ఉండని చోట కథ నడిపించి.. తర్వాత అంతా రాజకీయం చేశారని ఎవరికైనా అర్థం అవుతుంది.
ఇది బయట పడుతూండే సరికి విచారణను ఆలస్యం చేయడానికి తన కు అయిన కోడి కత్తి గాయం కంటే లోతైన విచారణ చేయాలని జగన్ పిటిషన్ వేశారని అంటున్నారు. అసలు ఈ కేసులో కుట్ర ఎందుకు లేదని.. భయంకరమైన రాజకీయ కుట్ర ఉందని… దాన్ని ఎన్ఐఏ బయటపెడుతోందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మిగతా వివరాలు బయటకు వస్తే… ప్రజలు విస్మయానికి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఘనత వహించిన యువనేత రాజకీయ చాతుర్యం… ఐ ప్యాక్ తెలివితేటలు అన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి.