మార్గదర్శిపై మేం దుష్ప్రచారం చేస్తాం… ఆ సంస్థకు ఎవరు అనుకూలంగా మాట్లాడినా సీఐడీ నోటీసులు ఇస్తామని బహిరంగంగా హెచ్చరించడమే కాదు.. నోటీసులు కూడా ఇచ్చేశారు. మార్గదర్శి విషయంలో చట్ట వ్యతిరేకంగా చెలరేగిపోతున్న సీఐడీ చీఫ్ సంజయ్… మార్గదర్శిపై కక్ష సాధింపులకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన వారికి నోటీసులు ఇచ్చారు. ఇంకెవరూ సమర్థించకుండా బెదిరించడానికి ఈ చర్యలు తీసుకున్నారు. అసలు ఓ సీఐడీ చీఫ్.. ఇలా ఎలా నోటీసులు ఇస్తారని నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ఏపీ రాజ్యాంగంలో ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారని అంటున్నారు.
సీఐడీ కొత్త చీఫ్ సంజయ్… పాత చీఫ్ సునీల్ కన్నా రెండాకులు ఎక్కువే స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయన ఏం ఆశిస్తున్నారో కానీ ప్రభుత్వ పెద్దల్ని మెప్పించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఫిర్యాదులే లేని కేసులో బాధితుల్ని కాపాడతామని విచిత్రమైన లాజిక్కులతో ఢిల్లీ దాకా వెళ్తున్నారు. మార్గదర్శిపై తప్పుడు ప్రచారం చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆయన వ్యవహారశైలి చూసి ఐపీఎస్ వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది. పీవీ సునీల్ హయాంలో చాలా జరిగాయి కానీ.. సునీల్ నేరుగా తెరపైకి వచ్చిన సందర్భాలు తక్కువ. తనను ఆ పోస్టులో ఉంచి కింది స్థాయి వ్యవహారాలతో మొత్తం చక్కబెట్టేవారు.
కానీ కొత్త చీఫ్ సంజయ్ మాత్రం మార్గదర్శి విషయంలో తానే యాక్టి వ్ పార్ట్ తీసుకుంటున్నారు. అసలు ఏమీ లేని కేసులో ఏదో చేసి మార్గదర్శిని ముంచేయాలనుకుంటున్నారు. ఓ ఐపీఎస్ అధికారి ఇలా కూడా వ్యవహరిస్తారా అని జాతీయ స్థాయిలో ఆయన పనితీరు ఆశ్చర్యకరంగా మారింది. చేసినంత కాలం ఎన్ని అయినా చేయవచ్చునని.. కానీ ప్రతీ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని.. బాధ్యత అనేది కూడా ఉంటుందని ఎవరో కాపాడతారని తప్పులు చేస్తే గతంలో అనుభవించిన వారి అనుభవాలు గుణపాఠాలని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఏపీ సీఐడీ అనేది ఓ అరాచకశక్తిగా మారిందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఇలాంటి చర్యల వల్లనే వస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.