ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ సోషల్ మీడియా అకౌంట్ ను నిర్వహిస్తున్నారు. అందులో వైసీపీపై .. ప్రభుత్వంపై వస్తున్న వార్తలు అబద్దాలని చెబుతూంటారు. అయితే ఇటీవలి కాలంలో అబద్దాలని చెప్పలేకపోతున్నారు. అందుకే దాన్ని మిస్ లీడింగ్ చెక్ అనేలా మార్చారు. ఫ్యాక్ట్ చెక్ మానేసి మిస్ లీడింగ్ అంటూ వైసీపీ వాదన వినిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు ఫేక్ ప్రచారం చేస్తున్నారని అసలు నిజాలు ఇవనీ.. ఓ అంశంపై పూర్తి డిటైల్స్ పెట్టారు. కానీ అవన్నీ చంద్రబాబు చెప్పింది నిజమని తేల్చడమే కాదు.. జగన్ ఇంత అమానవీయంగా వ్యవహరిస్తారా అని సామాన్యులు కూడా ఆశ్చర్యపపోయేలా చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో సీమ పర్వీన్ విభిన్న ప్రతిభావంతురాలైన మహిళ పెన్షన్ ను ప్రభుత్వం తీసివేయడంపై మండిపడ్డారు. ఇలాంటి వారి పెన్షన్లు ఎలా తీసేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదన్నారు. 2021 వరకూ వచ్చిన పెన్షన్ ను తర్వాత తీసేశారని విమర్శించారు. సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రశ్నించారు. సీమా పర్వీన్ ఫోటోలు, ఇతర పత్రాలు పోస్ట్ చేశారు.
చంద్రబాబునాయుడు ట్వీట్ వైరల్ అయింది. ప్రభుత్వం పెన్షన్ల తీసివేతలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చాయి. దీనిపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పందించింది. ఆమె అనర్హురాలు కావడం వల్లే ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన 22 ఏళ్ల సీమా పర్వీన్ 2021 సెప్టెంబర్ వరకు దివ్యాంగ పింఛన్ అందుకుంది. కానీ ఆ తర్వాత రెండు కారణాల వల్ల ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. ఈ మేరకు ఆమెకు 2021 సెప్టెంబర్ లోనే నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఆమె పెన్షన్ తొలగించడానికి మొదట కారణం ఆమె కుటుంబ గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉందట.
అసలు ఈ మూడు వందల యూనిట్ల అర్హత ఏ ప్రాతిపదిక అన్నది డౌట్ ఉంటే.. ఆ కరెంట్ మొత్తం ఒక మీటర్ ద్వారా కాదు.. నాలుగు మీటర్ల ద్వారా వినియోగించారని అందులోనే తెలిపారు. అంటే వారు ఉండే ఇంట్లో అద్దెకు ఉండే ఇతరుల కరెంట్ వినియోగాన్ని కూడా కలిపేశారన్నమాట. నిజానికి సీమా పర్విన్ అనే ఆమె 90శాతం వికలాంగురాలు.కనీసం నిలబడలేరు.కూర్చోలేరు.. అలాంటి మహిళలకు ఇలాంటి చెత్త అర్హతలు పెట్ట పెన్షన్ తీసేయడం అత్యంత దారుణమన్న కామెంట్లు జగన్ ప్రభుత్వంపై వస్తున్నాయి. వీటిని ఫ్యాక్ట్ చెక్ మరింత పెంచింది.