గుణశేఖర్ – శాకుంతలం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిజల్ట్, దీనిపై వచ్చిన రివ్యూలూ, వసూళ్లూ ఎలా ఉన్నా.. అల్లు అర్జున్ ఇంటి నుంచి అల్లు అర్హకు వెండి తెరపై గ్రాండ్ ఎంట్రీ వచ్చినట్టైంది. ఈ సినిమాలో భరతుడి పాత్రతో అర్హ… వెండి తెరపై అరంగేట్రం చేసేసింది. థియేటర్లో సమంత ఎంట్రీకి వచ్చిన అప్లాజ్ కంటే.. అల్లు అర్హ వచ్చినప్పుడే అప్లాజ్ ఎక్కువగా కనిపించింది. ఈ కథలో భరతుడి పాత్రకు అంత స్కోప్ లేదు. కానీ అర్హ కోసం.. అల్లు ఫ్యాన్స్ కోసం ఆ పాత్ర నిడివిని పెంచారు. దుష్యంతుడితో కొన్ని డైలాగులు చెప్పించారు. శుభం కార్డు ఫ్రేములోనూ అర్హకు చోటిచ్చారు. కనిపించిన కాసేపు.. అర్హ ముద్దు ముద్దు నటనతో… బన్నీ అభిమానుల్ని ఆకట్టుకోగలిగింది. శుక్రవారం అంతా.. బన్నీ ఇంట్లో.. అర్హ గురించే టాపిక్ అట. సినిమా చూసిన అల్లు అర్జున్ సన్నిహితులు అర్హ నటన గురించి.. బన్నీకి ఫోన్లు చేసి చెబుతుంటే.. సంబరపడిపోతున్నాడట బన్నీ. తనకు పుత్రికోత్సాహం ఎలా ఉంటుందో.. ఈ సినిమాతో అర్థమై ఉంటుంది. భవిష్యత్తులో… అర్హ ఇలానే నటిస్తుందా, లేదా? అంటే ఇప్పుడే చెప్పలేం. కానీ స్పెషల్ ఎప్పీరియన్సులు ఇవ్వాల్సి వస్తే.. తప్పకుండా బన్నీ కాదనడేమో..? బన్నీ కుమారుడు అల్లు అయాన్ కూడా చూడ్డానికి ముద్దుగా చలాకీగా ఉంటాడు. ఇక నెక్ట్స్ ఆయాన్ ఇంట్రీనే ఏమో.?