వైసీపీ నేతలకు పెద్ద కష్టం వచ్చి పడింది. వారికి ప్రెస్ మీట్ పెట్టమని చెబుతారు. ఏం చెప్పాలో కూడా చెబుతారు. చివరిలో ఓ సూచన ఉంటుంది అదేమిటంటే చంద్రబాబును తిట్టమని. మిగతా అంతా వదిలేసి చంద్రబాబును బూతులు తిట్టి.. ఆయనకు సవాల్ చేసి.. చివరికి శాంతపడిపోతారు. అయితే వీరి ఓవరాక్షన్ వల్ల ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో అది మాత్రం ఎవరికీ నోటీస్ కాదు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి వారం అయింది. నెగెటివ్ ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. దీంతో మంత్రులందరూ ప్రెస్ మీట్లు పెట్టాలని హైకమాండ్ ఆదేశించింది.
అమరావతిలో ముగ్గురు సీనియర్ మంత్రులు.. మిగతా జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టాలని ఆదేశించింది. ఈ ప్రెస్ మీట్ల లక్ష్యం .. తాము మెగా సర్వే చేపట్టామని.. ప్రజంలతా తమకు అనుకూలంగా ఉన్నామని చెప్పుకోవడం. ఈ మాటలు వారు చెప్పారు కూడా. కానీ ఇవే చెప్పి ఊరుకుంటే జగన్ ఊరుకోరు కదా అందుకే వెంటనే చంద్రబాబు జపం ఎత్తుకున్నారు. ఎప్పట్లాగే నానా మాటలు అన్నారు. జగన్ ను సంతృప్తి పరిచామని ఫీలయ్యారు. కానీ వీరి మాటల వల్ల అసలు వీరు ప్రెస్ మీట్ పెట్టిన అంశంపై మాత్రం పక్కకుపోయింది. చంద్రబాబు ను తిట్టిన తిట్లే హైలెట్ అయ్యాయి.
వైసీపీలో ఇప్పుడు ప్రతీ ఒక్కరూ చంద్రబాను తన మీద పోటీకి రమ్మని సవాల్ చేసేవారే. కుప్పం అయినా సరే.. నగరి అయినా సరే రమ్మని రోజా సవాల్ చేశారు. రోజాకు నగరిలో టిక్కెట్ ఇస్తారో లేదో అన్న చర్చ జరుగుతోంది. ఈ పైత్యం ఎక్కడిదాకా వెళ్తోందంటే చంద్రబాబు చావు గురించి మాట్లాడేదాకా వెళ్తుంది. టిక్కెట్ ఇస్తే టీడీపీలో చేరుతానని వెళ్లిన ప్రసన్నకుమార్ రెడ్డి.. అలా ఇవ్వలేమని చెబితే.. మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ఆయన కూడా చంద్రబాబు చావు భయంకరంగా ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు.
వైసీపీ నేతల తీరుతో.. ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడుతుందన్న ఆలోచన వారికి ఉండటం లేదు. టిక్కెట్ కోసం జగన్ ను మెప్పించాలంటే చంద్రబాబు చావు గురించి మాట్లాడాలన్నట్లుగా వారి తీరు ఉంది.