ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి మైసూర్ నుంచి ఓ ప్రత్యేక విమానం వచ్చింది. సాధారణంగా సీఎం జగన్ తో రహస్య భేటీల కోసం కొంత మంది పారిశ్రామిక వేత్తలు , ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు పాటించే గోప్యత కాస్త భిన్నంగా ఉంటుంది. అలాంటి గోప్యతే ఆ విమానంలో వచ్చిన ప్రముఖుల విషయంలో పాటించారు. ఎవరు వచ్చారో కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి సీఎం జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీ చెకింగ్స్ లాంటివేమీ లేకుండా నేరుగా వాహనాన్ని లోపలికి పంపినట్లుగా తెలుస్తోంది.
ఆ వాహనంలో ఎవరు ఉన్నారంటే.. చింతా శశిధర్ అనే పారిశ్రామికవేత్త. ఆయనతో పాటు విజయ్ కుమార్ అనే జ్యోతిష్యుడు ఉన్నారని తర్వాత తేలింది. ఆయన మైసూరుకు చెందిన వారు. ఉదయమే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తే అర్జంట్‌గా మైసూరు నుంచి సీఎం జగన్ జ్యోతిష్యుడ్ని పిలిపించుకోవడంతో … అంత అర్జంట్‌గా తన జాతకం చూపించుకోవాలని జగన్‌కు ఎందుకు అనిపించిందన్న ఆశ్చర్యం ఈ విషయం తెలిసిన సన్నిహిత వర్గాల్లో వ్యక్తమయింది. తమకు తెలిసి జగన్ కు అంత జాతకాల పిచ్చి లేదే అనుకున్నారు. కానీ విజయ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత అందరూ ఓహో జగన్ అటు వైపు నుంచి నరుక్కొస్తున్నారా అని అనుకుంటున్నారు.
మైసూరుకు చెందిన విజయ్ కుమార్ హై ప్రోఫైల్ వ్యక్తుల జాతకసలహాదారు మాత్రమే కాదు పూజలు అవినీ చేయిస్తూంంటారు. అది పెద్ద లాబీయిస్టు. ప్రముఖులు ఎవరైనా ప్రముఖ ఆలయాల దర్శనాలకు వచ్చేటప్పుడు ఆయన పక్కనే ఉంటారు. ఇటీవల ఏపీలో ఆలయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దర్శించడానికి ఎవరైనా వస్తే వారి వెంట ఈ విజయ్ కుమార్ ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట తిరుమల వచ్చిన సీజేఐ చీఫ్ జస్టిస్ వెంట కూడా విజయ్ కుమార్ ఉన్నారని చెబుతున్నారు. ఈయన చాలా పెద్ద విషయాల్లో జోక్యం చేసుకుని… పలువురికి రిలీఫ్ ఇప్పించాడన్నపుకార్లు ఉన్నాయి. దీంతో సీఎం జగన్ ప్రత్యేకంగా ఆయనను మైనసూర్ నుంచి పిలిపించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇదే నిజం అయితే ఇలాంటి లాబీయింగ్ ల ద్వారా నేరస్తులు మరింత నిండా మునిగిపోతారు కానీ బయటపడటం కష్టమని ఇప్పటికే అనేక సార్లు స్పష్టమయింది. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో ? జగన్ జాతకాన్ని జ్యోతిష్యుడు విజయ్ కుమార్ ఎలా మార్చేస్తారోననే సెటైర్లు వైసీపీలోనే అంతర్గతంగా వినిపిస్తున్నాయి.