తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పుట్టిన రోజు .. ఆయన మానాన ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ పుట్టిన రోజు అయినా ఆయన వర్కింగ్ స్టైల్ అంతే ఉంటుంది. అయితే ఆయనను నిరంతరం కించపర్చడానికి గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిపక్ష సోషల్ మీడియా ఓ క్యాంపెన్ చేసేది. పుట్టిన రోజు నాడు కూడా ఆయనను దారుణంగా తిట్టాలని .. కుటుంబాన్ని కించపర్చాలని టార్గెట్లు పెట్టుకునేవారు. అయితే ఈ సారి అలాంటి ప్రయత్నాలు చేసినా.. ఎన్సీబీఎన్కు సోషల్ మీడియాలో వచ్చిన పాజిటి వైబ్స్ కు తేలిపోయాయి.
ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా చంద్రబాబుకు గౌరవంగా శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయులు , విజయసాయిరెడ్డి అందర్నీ ఆశ్చర్యపరిచారు. విజయసాయిరెడ్డి గతంలో అత్యంత దారుణంగా విష్ చేసేవారు. కానీ ఈ సారి మాత్రం చాలా పొలైట్ గా విష్ చేశారు. ఆయన తీరు చూసి వైసీపీ నేతలు కూడా ముుక్కున వేలేసుకున్నారు. విజయసాయిరెడ్డి మారిపోయారని సెటైర్లు వేసుకుంటున్నారు. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా సోషల్ మీడియాలో పొలైట్ గా విష్ చేశారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి కూడా విష్ చేశారు. ఇక ఎప్పట్లాగే జనసేన చీఫ్ పవన్ స్పెషల్ గా విష్ చేశారు.
ఇక సోషల్ మీడియాలో ఏపీ పొలిటికల్ టైమ్ లైన్లలో ఎక్కువగా ట్రెండ్ అయింది చంద్రబాబు పుట్టిన రోజు విషయాలే. ఆయన పాలన ఉమ్మడి ఏపీ భవిష్యత్ కు ఎలా ఉపయోగపడిందనే దగ్గర్నుంచి విభజిత ఏపీలో ఐదేళ్ల పాటు సాగించిన పాలనలో జరిగిన అభివృద్దిని విస్తృతంగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. అయితే వైసీపీ సోషల్ మీడియాతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టించిన మధ్యాహ్నం ఎప్పుడో చంద్రబాబుకు సోషల్ మీడియా లో శుభాకాంక్షలు చెప్పే సీఎం జగన్ ఈ సారి మధ్యాహ్నం వరకూ పెట్టలేదు. ఇంతకు ముందు రోజే.. తల్లి విజయమ్మబర్త్ డే కు మధ్యాహ్నం తర్వాత విషెష్ చెప్పారు. ముందే చెబితే.. తల్లికి మధ్యాహ్నం చెప్పారు.. చంద్రబాబు ముందే చెప్పారని అంటారని అనుకున్నారేమో కానీ విష్ చేయలేదు.