” ఏ లై టోల్డ్ ఆఫెన్ ఇనఫ్ బికమ్స్ ద ట్రూత్ ” వ్లాదిమిర్ లెనిన్ అనే నియంత తనకు తానుగా పెట్టుకున్న ఓ సక్సెస్ సీక్రెట్. ఇలాంటివే అడాల్ఫ్ హిట్లర్, గోబెల్స్ వంటి వారు చాలా చెప్పారు. అంటే ఓ అబద్దాన్ని పదే పదే చెబితే అదే నిజం అని జనం అనుకుంటారు అని. ఆంధ్రప్రదేశ్‌లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ పుట్టినప్పటి నుండి ఆ పార్టీకి అప్రకటిత ఏకైక సక్సెస్ మంత్ర ఇదొక్కటే. అబద్దాన్నే కళ్లార్పకుండా చెప్పి.. చెప్పి ప్రజల్ని నమ్మించి అందర్నీ కాకపోయినా మెజార్టీని నమ్మించిన తమ రాజకీయ పబ్బం గడిపేసుకుంటున్నారు. ఇది ఏ స్థాయికి వచ్చిందంటే.. కళ్ల ముందు కనిపించే వాటిని కూడా అది అబద్దం అని వాదించేస్థాయికి వచ్చింది. తాము ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే ప్రజలు ఉన్నారు కదా అనే ధైర్యంతో… ఓ అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు ఎవరూ ఊహించనంత రేంజ్‌కు చేరింది. చివరికి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్ని కాపాడటానికి కూడా ఇదే పద్దతి వాడుతున్నారు.
కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడమే వైసీపీ స్ట్రాటజీ !
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాడింది..?. ఒక్క ప్రజాసమస్యపైనా పోరాడలేదు. అన్నీ పూర్తి స్థాయి అబద్దాలే. పట్టిసీమను మూడు నెలల్లో కట్టి నదుల అనుబంధానం పూర్తి చేస్తే దానిపైనా అబద్దాలే. గోదావరి జిల్లాల ప్రజలకు నీళ్లు లేకుండా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారని వాదించారు. అవినీతి అన్నారు. అక్కడ్నుంచి ప్రారంభిస్తే అమరావతి వరకూ.. కమ్మ డీఎస్పీల వరకూ వారు చేసిన అబద్దాల ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి అవన్నీ నిజాలు కావని ప్రజలకు తెలుసు. కానీ వందసార్లు ఓ అబద్దాన్ని చెబితే అదే నిజం అయిపోతుందన్న నియంతల సక్సెస్ సీక్రెట్ ను గట్టిగా నమ్మిన పిల్ల నియంతలు పక్కాగా అమలు చేశారు. ఎంత బరితెగింపు కాకపోతే ఢిల్లీలో ఈసీ ఆఫీసు ముందు ప్రెస్ మీట్ పెట్టి డీఎస్పీలంతా ఓ కులం వారే ఉన్నారని ఆరోపించండం. దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం. సోషల్ మీడియా… కూలీ మీడియాను ఉపయోగించుకుని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది ఒక్కటే కాదు.. అసలు అబద్దాలను వంద సార్లు ప్రచారం చేయడమనేదే వారి అస్త్రం.. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలోనూ ఈ అబద్దం ద్వారా ప్రజల్లోకి విషాన్ని ఎక్కించారు. అన్ని రాష్ట్రాలు గొప్ప రాజధానిని చూసుకుని మురిసిపోతాయి. తమ బిడ్డలకు తమ రాజధానిలో ఉద్యోగాలొస్తాయని ప్రజలు ఆశిస్తారు. కానీ అమరావతిపై కుల ముద్ర వేసి.. ప్రజల్ని నిట్ట నిలువునా చీల్చేసిన దారుణమైన పార్టీ వైసీపీ. అది ప్రచారం చేసిన అబద్దాలతో అమరావతికి ఈ రోజు ఏ దుస్తితి వచ్చిందో కళ్ల ముందు కనిపిస్తోంది. పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతూంటే.. ప్రపంచం మెచ్చిన కాన్సెప్ట్ తో అమరావతిని కాలదన్నుకున్నారు ఆంధ్రులు. పోలవరంపై అదే అబ్దదాలు. దశాబ్దాల కల నెరవేరుతుందన్నదశలో .. అబద్దాలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేశారు.. నాలుగేళ్లలో ప్రాజెక్టులను పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఎత్తు తగ్గిస్తామని కేంద్రం చెబుతూంటే నోరెత్తలేని పరిస్థితి. ఓ నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ప్రపంచం అంతా తిరిగి వస్తుందని సామెత. దీన్ని ఆసరాగాచేసుకుని అబద్దాల పంట పండించారు. అధికారం దక్కించుకున్నారు. కానీ ఒక్క సారి ” ఏ లై టోల్డ్ ఆఫెన్ ఇనఫ్ బికమ్స్ ద ట్రూత్ ” అనే సక్సెస్ సీక్రెట్ ను పట్టుకుంటే.. ఏ నియంత స్వభావంఉన్న వారికైనా వదిలి పెట్టబుద్ది అవుతుందా… అందుకే అధికారంలో ఉన్నా అవే అబద్దాలతో పాలన సాగుతోంది. చివరికి సొంత కుటుంబంలో హత్య జరిగినా… నిందితుల్ని కాపాడటానికి అదే అవాస్తవ.. ఫేక్ ప్రచారాల సాయంతో ప్రయత్నం.
తప్పించుకునేందుకు చనిపోయిన వివేకానందరెడ్డి క్యారెక్టర్ పైనే నిందలు !
వివేకానందరెడ్డి సౌమ్యులు, చీమకైనా హాని తలపెట్టరు.. అలాంటి వారిని ఇంత ఘోరంగా చంపాలని ఎలా అనిపించిందని సీఎం జగన్.. వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు నటించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు. వివేకానందరెడ్డిని అంతే ఘోరంగా చంపినా తప్పు లేదన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన కుటుంబంపై నిందలేస్తున్నారు. కూతురు , అల్లుడ్ని వదిలి పెట్టడం లేదు. వాళ్లే్ హత్య చేశారంటున్నారు. వివేకానందరెడ్డికి హంతకులందరితో రంకులు అంటగట్టేస్తున్నారు. అదే నిజం అని చెబుతున్నారు. వారు ఇప్పటికి ఎన్ని కథలు చెప్పారో లెక్కలేయడం కష్టం. మొదట గుండె పోటుతో ప్రారంభించారు. విషయం బయట పడేసిరికి చంద్రబాబు చంపించారన్నారు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో చంద్రబాబు చేతిలో పెద్ద కత్తి గ్రాఫిక్స్ తో పెట్టి మరీ ప్రచారం చేశారు. ఆదినారాయణరెడ్డి అన్నారు.. బీటెక్ రవి అన్నారు… కానీ ఏదీ తేలలేదు. సిట్ ద్వారా వివేకా కుమార్తె తన సోదరి అయిన సునీతను.. ఆమె భర్త వేసిన స్కెచ్ అని ప్రచారం చేయాలని మొత్తం రెడీ చేసుకుని.. చివరి క్షణంలో కోర్టు సీబీఐకి ఇవ్వడంతో దొరికిపోయారు. సునీత సీబీఐ విచారణ కోసం హైకోర్టుకు వెళ్లకపోతే ఇప్పటికి ఆమె సిట్ చేతిలో నిందలకు గురై జైల్లో ఉండేదేమో కానీ..ఇలాంటి నియంతలు ఇలా ఆలోచిస్తారా అని తెలిస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుందనడంలో సందేహం లేదు. కేసు సీబీఐకి ఇచ్చిన తర్వాత చేసిన విన్యాసాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా సీబీఐ అధికారుల మీదే కేసులు పెట్టేంత స్థాయికి ఎదిగారు. సాక్షుల్ని బెదిరించారు. హత్య జరిగినప్పుడు ఉన్న పోలీసులుకు పోస్టింగ్‌లు ఆశ చూపి స్టేట్మెంట్లు మార్పు చేయించారు. నిందితులతో అడ్డగోలు పిటిషన్లు వేయించి కోర్టుల్లో ఎంత ఆలస్యం కావాలో అంత ఆలస్యం చేయిస్తున్నారు. అంతేనా చివరికి దర్యాప్తు అధికారినీ మార్పించుకున్నారు. ఇప్పటికీ అదే కథ. తాము చెప్పినట్లుగా సీబీఐ అధికారులు చెబితే సరే లేకపోతే.. వారంతా చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని ఏడ్వటం.. అసత్యాలు ప్రచారం చేయడానికి దేనికైనా తెగిస్తున్నారు. కుటుంబసభ్యుడ్ని అంత ఘోరంగా చంపడం ఓ దుర్మారం అయితే.. దాన్నుండి తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తులు.. చేస్తున్న ప్రయత్నాలు చూస్తే మనుషుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోక తప్పదు.
కోడికత్తి కేసులో రాజకీయం కోసం ఓ నిర్భాగ్యుడి జీవితంతో ఆటలు !
కోడికత్తి కేసులో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరాలు లేవు. కోడికత్తితో దాడి జరిగిందన్నారు. చొక్కాకు రక్తం అంటిదన్నారు. హైదరాబాద్ వెళ్లి ఐసీయీలో చేరి మూడు వారాలు పక్కాగా డ్రామా ఆడారు. ఇందులోనూ అబద్దాలే. చివరికి ఎన్ఐఏ దర్యాప్తునూ వేయించుకున్నారు. ఎన్ ఐఏ విచారణలో తేలిందాన్ని కూడా తప్పు పట్టడం ఏమిటి ? తాము చెప్పినట్లుగా కుట్ర అని రాయకపోతే అది చంద్రబాబు జేబు సంస్థ అన్నట్లుగా చెప్పడమే. జనపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు ఎవడో అందరికీ తెలుసు. వారింటి పక్కన వారికే కాదు.. సీఎం జగన్ కూ తెలుసు. కనీస మానవత్వ విలువలు ఉన్న వారెవరైనా.. వాడెందుకు జైల్లో మగ్గిపోవాలి అని.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు ్ంగీకరిస్తారు. మామూలుగా అయితే విత్ డ్రా చేసుకుంటారు. రాజీవ్ గాంధీ హంతకులకే.. ఆ కుటుంబ వారసులు క్షమాభిక్ష పెట్టారు. కానీ ఇక్కడ కోడికత్తితో దాడి చేశాడో లేదో తెలియని కేసులో.. ఆ కుర్రాడికి బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఎన్ ఐఏ చెప్పింది నమ్మకుండా.. తన కోడి కత్తి గాయానికి ఎంత లోతు ఉందో అంత కంటే ఎక్కువ లోతుగా విచారణ జరపాలని పిటినన్లు వేశారు. ఇప్పటికీ అడ్డగోలు వాదనలో.. ఫ్లెక్సీలపై గరుడ బొమ్మ ఉందని.. ఎయిర్ పోర్టు క్యాంటీన్ ఓనర్ పేరు హర్షవర్ధన్ చౌదరి అంటూ అడ్డగోలు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇది అంతా చూస్తూంటే.. ఏ మాత్రం మానవత్వం లేని మనుషులే కళ్ల ముందు మెదులుతారు. ఎవరిపై ఎక్కి సవారీ చేసి.. అధికారంలోకి వచ్చారో వారినే పీడించుకు తినడం అంటే ఇదే.
కళ్ల ముందు కనిపించేవాటిపైనా అబద్దాలు చెప్పడం నియంత మనస్థత్వానికి పక్కా నిదర్శనం !
సీఎం జగన్ తాను ఒంటరి అంటారు . వేధిస్తున్నారు అంటారు. తనకు ఎవరూ లేరంటారు. తనకు పత్రికలు లేవంటారు. మీడియా లేదంటారు.. సోషల్ మీడియా లేదంటారు.. ఇలా చెప్పుకుంటూ… ఏదో సినిమాలో అడుక్కునే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఎవరూ లేని అనాధను కాపాడండి అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి. ఆయన బినామీ ఆస్తులు లెక్క తీస్తే ఎన్ని లక్షల కోట్లవుతాయో చెప్పడం కష్టం. కళ్ల ముందు కనిపించే సాక్షి ఆయనదే. కానీ తనది కాదంటారు. సోషల్ మీడియా సైన్యం ఓ పదివేల మంది ఉంటారు. కానీ వారెవరూ తనవారు కాదంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు తనకెవరూ లేరని చెుబతూ ఉంటారు. అంటే పక్కాగా అర్థమైపోతుంది.. ఓ అబద్దాన్ని పదే పదే చెబితే… ప్రజలు నిజమని నమ్మేస్తారని . సీఎం జగన్ మైండ్ సెట్ కూడా అంతే. ప్రజల్ని పరిగణనలోకి తీసుకోరు. వారికి ఆలోచనలు లేవనుకుంటారు. తాము ఏది చెబితే అదే నిజమని నమ్మేస్తారని అనుకుంటారు. అందుకే ఇలా కళ్ల ముందు కనిపించేవాటిని కూడా అబద్దాలుగా చెబుతూ ఉంటారు.
ప్రజలు విజ్ఞులు అయితేనే రక్షింపబడతారు !
ఇప్పుడు సమాచార శకం అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ సమాచార శకం ఆధారంగానే … ఏది ఎక్కువ మంది నమ్మితే అదే నిజం అనే ఓ కాన్సెప్ట తో .. ఓ అబద్దాన్ని వంద సార్లు చెప్పి నమ్మించడానికి పిల్ల నియంతలు బయలుదేరారు. వారికి తాత్కాలిక విజయాలు కూడా లభిస్తున్నాయి. వారి అబద్దాల్ని ఎప్పటికప్పుడు నమ్ముతూ పోతే.. వారికి అంతకు మించిన బలం చేకూర్చినట్లవుతుంది. ఇప్పుడు ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ తెలుసుకుని… అ అబద్దాలు చెబుతున్న వారి బుద్దిని గుర్తించి.. తగిన విధంగా బుద్ది చెప్పినప్పుడే ఇలాంటి నియంతల నుంచి ప్రజలు బయటపడతారు. లేకపోతే సర్వం కోల్పోయిన తర్వాత వారిని తరిమికొట్టి చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ప్రజలు ముందు నిజాల్ని తెలుసుకోవాలి.