వైసీపీ నేతల అసహనం కుట్రలు చేసి ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడులు చేసే వరకూ వెళ్తోంది. వారికి పోలీసులు అడ్డగోలుగా సహకరిస్తున్నారు. యర్రగొండపాలెంలో ఉద్దేశపూర్వకంగా ఉదయం నుంచి చంద్రబాబు రోడ్ షోకు వస్తున్నారని చెప్పి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు గుమికూడారు. స్వయంగా మంత్రి ఆదిమూలం సురేష్ చంద్రబాబు వచ్చిన సమయంలో చొక్కా విప్పేసి షో చేశారు. కాసేపటికే కరెంట్ తీసేశారు.
చంద్రబాబు రోడ్ షో జరుగుతున్న సమయంలో కరెంట్ తీసేసి వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. పోలీసులు ఉద్దేశపూర్వకంగా రాళ్లదాడికి వచ్చినవారికి చంద్రబాబు కాన్వాయ్ వరకూరానిచ్చారు. తర్వాత రాళ్ల దాడి చేసే వరకూ ఊరుకుండి…తర్వాత తరిమేశారు. దాంతో రాళ్ల దాడి చేసి వారు చక్కా వెళ్లిపోయారు. రాళ్లు వేస్తున్న విషయం చూసి ఎన్ఎస్జీ కమెండోలు చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డారు. దాంతో ఓ ఎన్ఎస్జీకమెండో తలకు రాయి తగిలింది. ఆయనకు మూడు కుట్లు పడ్డాయి.
కావాలని ఉద్రిక్తతలు సృష్టించే ఉద్దేశం స్పష్టంగా కనిపించడంతో ఎన్ఎస్జీ భద్రత సిబ్బందిని పెంచారు. అయినప్పటికీ దాడి జరిగింది. ఏపీప్రభుత్వ పాలకులు మనుషుల్ని భౌతికంగా అంతమొందించేదుకు కూడా వెనుకాడని వ్యక్తులుగా ఇప్పటికే నిర్ధారణ కావడంతో ఎన్ఎస్జీ చంద్రబాబు భద్రతను భారీగాపెంచింది. అయినా స్థానిక పోలీసులు బాధ్యత మరిచి మూకలకు సహకరిస్తున్నారు. చంద్రబాబుపై దాడికి పక్కాస్కెచ్ వేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి పోలీసులు సహకరంచారు.
చంద్రబాబు భద్రతా లోపాలు.. స్థానిక పోలీసుల కుట్రలపై ఎన్ ఎస్జీ అధికారులు ఢిల్లీకి నివేదిక అందించే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపుతప్పాయని పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్న అభిప్రాయం ఢిల్లీ స్థాయిలో వ్యక్తమవుతోంది.