వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడేలా వైఎస్ సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సమగ్రమైన వివరాలు పొందు పరిచారు. అవినాష్ ను కాపాడేందుకు జగన్ చేసిన ప్రయత్నాలను ఓ క్రమ పద్దతిలో వివరించారు. అసెంబ్లీలో ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా .. వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగం చేశారో చాలా స్పష్టంగా వెల్లడించారు. దీంతో ఓ నిందితుడు అయిన వ్యక్తిని కాపాడటానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు ఇలా ప్రయత్నించారనేది సంచలనం అవుతోంది.
వైఎస్ వివేకా దాఖలు చేసిన పిటిషన్ లోని అంశాలపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఇవన్నీ సజంగానే చర్చకు వస్తాయి. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ పైనే సునీతకు అనుమానం ఉందన్న విషయంలో కొత్త వాదనలు జరిగే అవకాశం ఉంది. అసలు అవినాష్ రెడ్డిని ఎలాగైనా రక్షించాలని జగన్ ఎందుకు తాపత్రయ పడుతున్నారనే ప్రశ్న మౌలికంగా వస్తే సమాధానం కోసం ప్రయత్నాలు ఆటోమేటిక్ గా జరుగుతాయి.
సుప్రీంకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్లో జగన్ పై ఆరోపణలు నేరుగానే ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు హత్యలో జగన్ పాత్ర ఉందని సునీత సుప్రీంకోర్టు దృష్టికి విజయవంతంగా తీసుకెళ్లినట్లేనని చెబుతున్నారు. సాధారణం ఏదైనా తీవ్ర నేరం ఆరోపణలు వస్తే రాజకీయ పార్టీలు ఆ నేరాన్ని తమ మీద వేసుకోవు. అధికారంలో ఉంటే మరింత జాగ్రత్తగా ఉంటాయి. నిజాయితీ నిరూపించుకోవాలని చెబుతాయి. కానీ అవినాష్ రెడ్డిని జగన్ వంద శాతం వెనకేసుకు వస్తున్నారు. నిజాయితి నిరూపించకోవాలని చెప్పకుండా.. ఆయన తరపున వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారు.
అవినాష్ రెడ్డి ఇబ్బంది పడితే తాను ఇబ్బంది పడినట్లేనన్నంతగా జగన్ ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినాష్ రెడ్డి గనుక సీబీఐ దగ్గర దొరికిపోతే అసలు సమస్య జగన్ కే వస్తుందని అందుకే ప్రజల్ని కూడా పట్టించుకోకుండా .. ఏవరేమనుకున్నా ఆయన అవినాష్ ను కాపాడుతున్నారని అంటున్నారు. సామాన్యుల్లోనూ ఈ అంశం వల్లే అనుమానాలు పెరుగుతున్నాయి.