ఏపీలో ఉన్న పాలకులు, రాజకీయ పరిస్థితుల గురించి కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తూనే ఉంటుంది. అందుకే చంద్రబాబుకు అత్యంత సుశిక్షుతులైన ఎన్ఎస్జీ కమెండోలు రక్షణగా ఉంటున్నారు. గతం కన్నా భారీగా పెంచారు. తమకు దక్కని ఎవరికీ దక్కకూడదనే సైకో లాంటి మనస్థత్వం ఉన్న రాజకీయ నేతలతో చంద్రబాబు పోరాడుతూండటంతో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో..ఆయనకు మరింత భద్రత పెంచారు. ఇప్పుడు 12 మంది సుశిక్షితులైన కమెండోలు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇస్తున్నారు. జెడ్ ప్లస్ అంటే.. ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రోటోకాల్ కూడా ఉంటుంది.
కానీ అవేమీ పట్టించుకోవడం లేదు. ఏపీ పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వారు రాజకీయ కుట్రల్లో భాగం అవుతున్నారు. నేరాలకు సహకరిస్తున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటనలో పోలీసుల తీరు దేశవ్యాప్త చర్చనీయాంశమయింది. చంద్రబాబు పై తరచూ రాళ్ల దాడి ఘటనలు జరగడాన్ని ఎన్ఎస్జీ హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాళ్ల దాడిపై ఎన్ఎస్జీ హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్ఎస్జీ కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు.
చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై ఎన్ఎస్జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖకు కూడా ఎన్ఎస్జీ నివేదిక పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎన్ఎస్జీ ప్రొటెక్టీ అయిన చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన విధానంలో మార్పుల గురించి .. కేంద్ర హోంశాఖలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీకి స్పష్టమైన హెచ్చరికలు కేంద్ర హోంశాఖ నుంచి వస్తాయని చెబుతున్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేనట్లేగా కేంద్ర హోంశాఖ ఏ నిర్ణయం తీసుకున్నా.. అది పోలీసు శాఖకు అవమానమేనని అనుకోవచ్చు.