టైమ్స్ నౌ చానల్ లో హఠాత్తుగా వచ్చిన ఓ సర్వేలో వైసీపీ లోక్సభ సీట్లు అన్ని క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పడం వెనుక వైసీపీ నేతల అసలు లక్ష్యం రాష్ట్రంలో ప్రచారం చేసుకోవడం కన్నా కేంద్రాన్ని ప్రభావితం చేయాలన్న లక్ష్యంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సర్వే రావడం ఆలస్యం ఢిల్లీ బీజేపీ వర్గాల్లో విస్తృతంగా మార్కెట్ చేసుకుంటున్నారని.. తమకు పూర్తి స్థాయిలో సహకిరంచేలా ట్యూన్ చేసుకుంటున్నారన్న చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది.
ఏపీలో ఇటీవల ప్రజలు ఓట్లేసిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. చివరికి జగన్ సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచాడు. అదే సమయంలో చాలా సర్వేల్లో వైసీపీ పూర్తిగా వెనుకబడిపోయిందన్న ఫలితలు వెల్లడవుతున్నాయి. ఐప్యాక్ సర్వే అయితే .. చాలా కులాల కుంపట్ల పెట్టకపోతే కష్టమని గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే కేంద్రం.. ఓడిపోయే వైసీపీ విషయంలో ఎందుకు చొరవ చూపించాలన్న ఉద్దేశంతో ఇటీవలి కాలంలో సహకారంపూర్తి స్థాయిలో తగ్గించేసిందన్న ప్రచారం జరుగుతోంది. కానీ తమ బలం తగ్గలేదని సర్వే వేయించుకోవడం ద్వారా.. కేంద్రం వద్ద మళ్లీ పలుకుబడి సంపాదించుకుని.. అప్పులు.. కేసుల విషయంలో బయటపడాలన్న ఆలోచనతోనే సర్వే పేరుతో కొత్త నాటకం వేసినట్లుగా చెబుతున్నారు.
టైమ్స్ నౌ చానల్ లో వేసిన ఎన్టీజీ సర్వేకు ఎలాంటి ప్రతిపదిక లేదు. ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారోస్పష్టత లేదు. అది ఫోన్ సర్వేనా లేకపోతే ఫీల్డ్ లో తిరిగారా అన్నది కూడా తెలియదు. అందుకే ఈ సర్వేను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. ఈ సర్వేను అడ్డం పెట్టుకుని చాలా ప్రయోజనాలు ఆశిస్తున్నారంటున్నారు. అయితే కేంద్ర పెద్దల్ని ఓ మాదిరిగా చూడకుండా.. ఇలాంటి ఫేక్ సర్వేలతో ఏదో చేయాలనుకుంటే… సరైన సమాధానం చెబుతారన్న సెటైర్లు అయితే ఢిల్లీలో వినిపిస్తున్నాయి.