రాయలసీమన తెలంగాణలో కలపాలని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. అలా చేస్తేనే రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడం కష్టంకానీ కలపడం కష్టమని ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఇలా రాయలసీమను తెలంగాణలో కలపాలంటే.. ముందు ఏపీ నుంచి విడగొట్టాలి కదా అన్న లాజిక్ ఆయన మిస్సవుతున్నరు. రాయల తెలంగాణ డిమాండ్ కు మొదట్లోనే కొంత మంది రాయలసీమ నేతలు సపోర్ట్ చేశారు. జేసీ బ్రదర్స్ తో పాటు టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు కూడా మద్దతు పలికారు. దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు.
ఇప్పుడు కొంత మంది ప్రత్యేక రాయలసీమ అంటున్నారని వస్తే మంచిదేనని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమను కలుపుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం ఉండదన్నారు. జేసీ దివాకర్ రెడ్డి వయసు కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన వారసులు మాత్రం చురుకుగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి , ఆయన కుమారుడు ఇంకా జోరుగా ఉంటే.. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు పవన్ రెడ్డి మాత్రం నెమ్మదిగా ఉన్నారు. అయితే దివాకర్ రెడ్డి ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ తరచూ చేస్తూనే ంటారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఎలాగూ ప్రత్యేక రాయలసీమ పేరుతో ఉద్యమం లేవనెత్తుతారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. కర్నూలు న్యాయ రాజధాని పేరుతో ప్రజల్ని ఇప్పటికే మభ్య పెట్టారని అంటున్నారు. బళ్లారి ప్రాంతాలను కలుపుకుని రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయడానికి కొంత మంది గతంలోనే ప్రణాళికలుసిద్ధం చేశారని అంటున్నారు. అటువంటి వారికి జేసీ మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.