నువ్వే మా నమ్మకం జగన్ అంటూ రెండు వారాల పాటు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు వేశారు. ఇంకా ఇళ్లు మిగిలిపోయాయనని మరికొన్ని రోజులు సమయం పెంచుకున్నారు. అయితే ఏ ఇంటి ముందు చూసినా స్టిక్కర్లు కనిపించడం లేదు. దీంతో అసలు ప్రోగ్రాం జరిగిందా లేదా అన్న డౌట్ చాలా మందికి వచ్చేస్తోంది. జగనే మా నమ్మకం అంటూ స్టికర్లు అంటించి మిస్డ్ కాల్స్ ఇప్పించుకుని వెళ్లిపోయారు. కానీ వాళ్లు అలా వెళ్లిపోయిన తర్వాత స్టిక్కర్లు తీసి పడేశారు జనం. స్టికర్లు అంటించే వాళ్లు కూడా.. తాము అంటించే వరకూ ఉంచుకోండి… తాము వెళ్లిపోయిన తర్వాత మీ ఇష్టం అని బతిమాలుకున్నారు.
మెగా సర్వే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకోవడమే… కాదు అత్యంత సాహసం చేస్తున్నామని చెప్పుకున్నారు. ఆ సాహసం ఏమిటంటే అందర్నీ భయపెట్టడం. తప్పనిసరిగా స్టిక్కర్లు అంటించుకోకపోతే రచ్చ అవుతుదంని బెదిరించండం. బలవంతంగా మిస్డ్ కాల్స్ ఇప్పించుకోవడం. ఈ ఫోన్ నెంబర్లతో తర్వాత ఎలాంటి బెదిరింపులుక పాల్పడతారో కానీ.. ఇప్పుడు మాత్రం ఆ డేటా అంతా సేకరించి పెట్టుకున్నారు. కానీ నిజంగా.. నిజాయితీగా ఎంత మది ఈ ఫోన్ నెంబర్లకు మిస్డ్ కాల్స్ ఇచ్చారనేదే కీలకం.
ఇంటి ముందు స్టికర్లు ఎక్కడా కనిపించడం లేదు. చదవుకున్న, మధ్య తరగతి ఇళ్ల దగ్గర అసలు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ అని చెప్పుకునే వర్గాల కాలనీల్లోనూ స్టిక్కర్లు అంటించిన గంటకే కనిపించడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి.. తమకు చాలా గొప్ప పాజిటివ్ నెస్ ఉందని ప్రచారం చేసుకోవడానికి.. మిస్డ్ కాల్స్ అంటూ త్వరలో ప్రకటించుకుని… తమకు 175 స్థానాలు వస్తాయని చెప్పుకోవచ్చు గాక.. రియాలిటీ ఏమిటో తెలుసుకోలేకపోతే.. తమను తాము మోసం చేసుకునేవాడు ఎప్పుడూ బాగుపడడనే విషయానికి తర్వాత వారే బ్రాండ్ అంబాసిడర్లు అయ్యే చాన్స్ ఉంది.