సీఎం జగన్‌ను మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే అనే వ్యక్తి కలిశారు. ఆయన సీఎం జగన్ ప్రధాని కావాలనే స్లోగన్‌తో టీ షర్టు వేసుకున్నాడు. ఆయనను జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఫోటోలు దిగారు. ఆయన ఎనిమిది వందల కిలోమీటర్ల పాటు సైకిల్ యాత్ర చేసి.. వచ్చాడని. జగన్ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆ విషయాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ప్రధాని పదవిపై జగన్ ఆశపడ్డారని.. చాలా మందికి క్లారిటీ వస్తోంది. దీన్ని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కూడా ధృవీకరిస్తున్నారు.
సీఎం పదవి వచ్చిందని జగన్ సంతృప్తి పడటం లేదని.. ప్రధాని పదవిపైనా ఆశ పెట్టుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవిపై ఆశతో.. దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర ఉందని..అదంతా సీబీఐకి తెలుసని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ అనుకూలంగా చేయకపోయినా.. కోర్టు తీర్పులు అనుకూలంగా రాకపోయినా తప్పు పడుతున్నారని.. వారు చెప్పినట్లే జరగాలా అని ప్రశ్నించారు.
తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కూడా లేదని… ఎప్పుడైనా చంపుకోవచ్చని స్పష్టం చే్శారు. తాను ఇక లేనని.. ఎప్పుడైనా తనను చంపేయవచ్చని.. కుటుంబసభ్యులకు కూడా చెప్పానన్నారు. వివేకా హత్య కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది.