సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతను చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారు. ఎప్పుడు మాట్లాడినా అధికార కార్యక్రమం అయినా.. రాజకీయ కార్యక్రమం అియనా చంద్రబాబును విమర్సించడమే పనిగా పెట్టుకున్నారు. అవి విమర్శల స్థాయి నుంచి తిట్ల వరకూ వెళ్లిపోతున్నాయి. తాజాగా వసతి దీవెన నిధుల ఆపి ఆపి.. చివరికి బటన్ నొక్కారు. ఖాతాల్లో పడతాయో లేదో కానీ.. ఈ కార్యక్రమానికి విద్యార్థుల్ని బలవంతంగా తెప్పించి వారి ముందు చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు.
చంద్రబాబు రిపబ్లిక్ టీవీతో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుని .. ఓ ముసలాయన వచ్చీ రాని ఇంగ్లిష్ లో మాట్లాడారని ప్రారంభించి పిట్టకథ చెప్పారు. మొత్తం రాసుకొచ్చి చదివిన స్క్రిప్టే. ఓ పిట్ట కథ చెప్పేశారు. రిపబ్లిక్ టీవీ చంద్రబాబు మాట్లాడిన మాటలను చూస్తే తనకు నర మాంసానికి అలవాటు పడిన పులి కథ గుర్తుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. ముసలిదై వేటాడే శక్తి కోల్పోయాక గుంట నక్కలను వెంట వేసుకొని తిరుగుతుందని చెప్పుకొచ్చారు. బంగారు కడియం ఆశ చూపి మనుషులను మింగేసే పులి లాగానే చంద్రబాబు కూడా వెన్నుపోటు కుట్రలు పన్నారని చెప్పుకొచ్చారు.
ఓ వైపు సొంత కుటుంబసభ్యుల్ని తండ్రి తర్వాత అంతటి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారికి సంపూర్ణ మద్దతు నిస్తూ.. తనపై ఆనుమానాలు ప్రజల్లో వస్తున్నా.. ఏమీ తెలియనట్లుగా కళ్లార్పకుండా అన్నిరకాలుగా మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్.. రివర్స్‌లో చంద్రబాబుపై ఆరోపణలు చేసుకొచ్చారు. చంద్రబాబును పదే పదే ముసలి వ్యక్తిని సంబోధిస్తున్నారు. ముసలి వ్యక్తిని తలుచుకుని గజగజ వణికిపోతున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
ఎప్పట్లాగే మీ బిడ్డ బిడ్డ అంటూ జగన్ సెంటిమెంట్ ప్రయోగించారు కానీ..త చంద్రబాబును ముసలాయన అంటూంటే చాలా మంది పెద్దవాళ్లు కూడా ఇబ్బంది ఫీలవుతున్నారు. వయసు దాటిన పెద్దవాళ్లను గౌరవించలేని సీఎం పిల్లలకు.. ఏం సంస్కారం నేర్పుతున్నారని ప్రశ్నిస్తున్నారు. సభ్యత.. సంస్కారం సహా ఏ లక్షణాలు లేని జగన్ పిల్లల ముందు ఎలా ప్రసంగించాలో కూడా తెలియకుండా.. వారికి ఏం నేర్పుతారన్న ప్రశ్నలు వస్తున్నాయి.