2023 మైత్రీ మూవీ మేకర్స్ కి బాగా కలిసోచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసి, ఆ రెండు సినిమాలు కూడా పండక్కి విడుదల చేసి విజయాలు అందుకున్న నిర్మాణ సంస్థగా మైత్రీ అరుదైన రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఇంతలోనే సంస్థకు ఊహించిన పరిమాణం ఎదురైయింది. మైత్రీపై ఐటీ దాడులు జరిగాయి.
ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలున్నాయన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ.. ఐటీ అధికారులు మైత్రీ మూవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ అధినేతలైన నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. వారు నిర్మిస్తున్న పుష్ప-2 చిత్ర దర్శకుడు సుకుమార్ కార్యాలయం, నివాసాల్లోనూ మరో బృందం తనిఖీలు చేపట్టింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి వందరోజులు పూర్తి చేసుకుంది. వందరోజుల పండగని ఏప్రిల్ 23న నిర్వహిస్తామని ప్రకటించారు నిర్మాతలు. అయితే ఐటీ దాడుల నేపధ్యంలో ఈ వేడుకలని రద్దు చేసుకున్నారని తెలుస్తుంది. వందరోజులు పండగ అనేది అరుదైన విషయంగా మారిపోయింది. అలాంటి అరుదైన పండగని చూద్దామని ఆశలు పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్ కి మైత్రీ తాజా పరిమాణాలు నిరాశనే మిగిల్చాయి.