మార్గదర్శి అంశంపై టీడీపీ నేతలు తనతో చర్చకు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ చేశారు. దానికి జీవీ రెడ్డి అనే టీడీపీ అధికార ప్రతినిధి సరే అన్నారు. తాను సిద్ధమన్నారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్. పార్టీ అధికార ప్రతినిధిగా చర్చకు వస్తానన్నారో లేకపోతే ఏ హోదాలో చర్చకు వస్తానన్నారో కానీ.. ఆయన హోదా ప్రకారం టీడీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఉండవల్లిఅరుణ్ కుమార్ కు ఇంత కన్నా గొప్ప చాన్స్ ఉండదు. చర్చ పెట్టేసి నిజాలు బయటపెట్టి ఉంటే బాగుండేది. కానీ ఉండవల్లి మాత్రం సవాల్ చేసి పారిపోయే వైసీపీ నేతల మాదిరిగా షరతులు పెడుతున్నారు.
జీవీ రెడ్డి తో చర్చకు సిద్ధమని కానీ రామోజీరావు సమక్షంలో జరగాలని ఆయన అంటున్నారు. అదే సమయంలో మార్గదర్శిపై చర్చకు రెడ్డి సామాజికవర్గం నేతే కావాల్సి వచ్చిందా అనే ఓ తత్తర బిత్తర ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. దీంతో మార్గదర్శి విషయంలో దొరికిపోతామని తెలిసే.. చర్చకు రాకుండా పారిపోవడానికి ఈ ప్రచారం చేసుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్… అసలు బాధితులే లేని అంశంలో రచ్చ చేసి… కొత్తగా బాధితుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు.
కానీ రాష్ట్రం నాశనమైతే పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలో ఆయన చేసిన విమర్శలు.. అప్పటి పాలన.. ఇప్పుడు ఆయన వ్యవహారం చూస్తే… వీళ్లెవరికి రాష్ట్రం గురించి కానీ.. ప్రజా ప్రయోజనాల గురించి పట్టింపే ఉండదని.. ఓ కులంపై ద్వేషంతో…. తమ ఒళ్లంతా వ్యాపించిన కులం క్యాన్సర్ తో ఎప్పటికప్పుడు విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.