ఇది కూడా జరుగుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఏపీ నుంచి సహకారం అందుతోంది. సూడాన్‌లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. అక్కడ ఐసిస్ టెర్రసిట్లు దగ్గర పెద్ద ఎత్తున ఏపీలో తయారైన మెడిసిన్స్ లభించాయి. ట్రమడోల్ అనే టాబ్లెట్లను ఏపీలోని సేఫ్ ఫార్మా తయారు చేస్తుంది. వాటిని పెద్ద ఎత్తున ఐసిస్ టెర్రరిస్టుల దగ్గర పట్టుకున్నారు. గోప్యంగా జరిగిన విచారణ తర్వాత సేఫ్ ఫార్మా డైరక్టర్ శ్రీధర్ రెడ్డిని ముంబై నుంచి వచ్చిన కీలక దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు.
ట్రమడోల్ టాబ్లెట్లు పెయిన్ కిల్లర్లుగా వాడతంతో పాటు ఎక్కువ సేపు నిద్ర రాకుండా ఉండేందుకు వాడతారు. వీటిని ఎగుమతి చేయడానికి ముఖ్యంగా ఐసిస్ టెర్రరిస్టులకు ఎగుమతి చేయడానికి అనుమతులు లేవు. కానీ అక్రమంగా టన్నుల కొద్దీ ఐసిస్ కు టాబ్లెట్లు చేరిపోయాయి . వారు వాడుతున్నారు. ఇప్పుడు విషయం బయటపడింది. ఎప్పట్నుంచి ఇలా ఎగుమతి చేస్తున్నారు.. ఎలా డబ్బులు తీసుకుంటున్నారు అనేది తేలాల్సి ఉంది. అన్నీ విచారణలో ఉన్నాయి
ఈ సేఫ్ ఫార్మా కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందినది. ఆ కుటుంబం కష్టపడి.. ఈ ఫార్మాను ఏర్పాటు చేసి కొన్ని పేటెంట్లు పొందింది. ఈ కంపెనీ ఇప్పుడు వారిది కాదు. ఏపీలో ప్రభుత్వం మారగానే… కోడెలపై ఎన్ని వేధింపులకు పాల్పడ్డారో చెప్పాల్సిన పని లేదు. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలోనే ఈ సేఫ్ పార్మా చేతులు మారిపోయింది. కోడెల కుటుంబం నుంచి ఇతరులు రాయించేసుకున్నారు.
అరెస్ట్ అయిన శ్రీధర్ రెడ్డితో పాటు ఓ ఎంపీకి ఇందులో వాటా ఉంది. ఆయన కూడా వైసీపీనే. మొత్తం వైసీపీ నేతలు దందా నిర్వహిస్తున్నారు. ఇంత దారుణమైన వ్యవహారంలోనూ కేంద్రం … పార్టీలు చూసుకుని విషయాన్ని లైట్ తీసుకుంటుందా.. అసలు కుట్ర మెడిసిన్స్ ను పంపడమేనా అంతకు మించి ఉందా అన్నది తేలుస్తుందా అన్నది ఇప్పుడు కీలకం.