ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ సర్టిఫికెట్ల స్కాంలో నిండా మునిగారు. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని టీడీపీ బయట పెట్టింది. ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించి.. చివరికి ఆయన పెట్టింది… నకిలీ డిగ్రీ అని ఆధారాలు బయట పెట్టింది. అయితే ఇప్పుడు ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు … తెలంగాణ ప్రభుత్వంతో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి… నకిలీ డిగ్రీ ఇచ్చిన తమ్మినేనిపై పోలీసులకు…. ఆయనకు లా అడ్మిషన్ ఇచ్చిన కాలేజీ కానీ… తమ పేరుతో నకిలీ డిగ్రీ తయారు చేశారన్న కారణంగా యూనివర్శిటీ కానీ ఇంకా కేసులు పెట్టలేదు.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయట పడితే వెంటనే ఆయన యూనివర్శిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీని బయట పెట్టింది. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే దానికి అంత విలువ రాదు. తమ సర్టిఫికెట్లు ఫేక్ చేసినందుకు యూనివర్శిటీ లేదా కాలేజీ పోలీసు కేసు పెట్లాల్సి ఉంటుంది.. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు.. ఎందుకుతయారు చేశారు.. ఇలా ఎన్ని సర్టిఫికెట్లు తయారు చేశారన్నది తేలిస్తే.. చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయనపై ఈగ కూడా వాలదు. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే. అయితే తమ్మినేని సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆయన బయటపడటం కష్టం . వచ్చే ఎన్నికల తర్వాత ఆయనకు స్పీకర్ పదవి ఉండదు. ప్రభుత్వాలు ఇవే ఉంటాయన్న గ్యారంటీలేదు. ఏ ఒక్క చోట ప్రభుత్వం మారిన ఆయనకు కోడెల కంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.