భారత్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ల ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉంటుందో అంచనా వేయలేం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల బడ్జెట్లో కనీసం 30 శాతం కాంట్రాక్టుల రూపంలో ఈ కంపెనీకే చేరుతూంటాయని చెబుతూంటారు. ఇవి కాక జాతీయ ప్రాజెక్టులు కూడా. మరి అలాంటి కంపెనీలో డైరక్టర్ అయిన మేఘా సుధారెడ్డికి ఉండే చిన్న చిన్న ఫ్యాషన్ కోరికలు తీర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. అవి వారికి చిన్న చిన్నవే కానీ మన లాంటి వారికి వాటి ఖర్చు గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మం ఖాయమని చెప్పుకోవచ్చు .
మేఘా సుధారెడ్డి అమెరికాలో వైట్ హౌస్ కరస్పాండెట్స్ డిన్నర్ వీకెండ్ కు హాజరవుతున్నారని ఇది ఆమెకు లభించిన అరుదైన గౌరవమని మేఘా కంపెనీ పీఆర్ మీడియాకు సమాచారం ఇచ్చింది. వైట్ హౌస్‌కు.. మేఘా కంపెనీ డైరక్టర్‌కు లింకేమిటా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఇక్కడ అసలు విషయం ఉంది.
వైట్ హౌస్ కరస్పాండెట్స్ డిన్నర్ అనేది చారిటీ కార్యక్రమం లాంటిది. వైట్ హౌస్ నుంచి అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రిపోర్ట్ చేస్తూంటారు. ఆ జర్నలిస్టులు అందరూ కలిసి ఈ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
ఖరీదైన స్టార్ హోటల్ లో జరిగే వైట్ హౌస్ కరస్పాండెట్స్ డిన్నర్ వీకెండ్ కు జర్నలిస్టులు మాత్రమే కాదు. రెండున్నర వేల టిక్కెట్లుకూడా అమ్ముతారు. అయితే ఆ టిక్కెట్ల రేట్లు మాత్రమే కాదు… వారికి ఇచ్చే విరాళాలను బట్టి కూడా కేటాయిస్తారు. ఎవరికి పడితే వారికి కేటాయించరు. బ్రిటన్ కు చెందిన ఓ వెబ్ సైట్ కనీసం 75వేల యూరోలు ఖర్చు అవుతాయని చెప్పింది. అంటే దాదాపుగా 67 లక్షల రూపాయలు. అంత కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు , ఈ డిన్నర్ కు అమెరికా అధ్యక్షుడు.. ఉపాధ్యక్షురాలు కూడా హాజరవుతారు కాబట్టి బాగా డబ్బు చేసిన చాలా మంది కోట్లు పెట్టి అయినా ఈ డిన్నర్ కు హాజరవాలనుకుంటారు. ఇలాంటి వాటిపై మేఘా సుధారెడ్డికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.
ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో ఆమె అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలను కూడా నిర్వహిస్తుంటారు. ఆ షోల కోసం దుబాయ్, ఫ్రాన్స్, అమెరికాల నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొస్తుంటారు. ఆ ఇష్టంతోనే మెట్ గాలాలోనూ పాలగొన్నారు. మెట్ గాలాలో ఓ టేబుల్ రిజర్వ్ చేసుకోవాలంటే రూ. రెండుకోట్లకుపైగా వెచ్చించాలి. ఆయినా అది ఆమెకు చిన్న విషయమే. ఇప్పుడు వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నరకూ అలాగే ఖర్చు పెడుతున్నారు.