ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ కవితకు పర్సనల్ ఆడిటర్ గా పని చేయడమే కాకుండా… సౌత్ లాబీ తరపున మొత్తం ఆర్థిక వ్యవహారాలను చక్క బెట్టారన్న ఆరోపణలు ఉన్న హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారన్న ఓ ప్రచారం ఊపందుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీకి్ చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే అఫీషియల్ గా సీబీఐ, ఈడీ అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కోర్టుకు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్క దినేష్ అరోరా మాత్రమే అప్రూవర్ గా మారారు.
ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారితే ఎంపీ కవిత మరిన్ని కష్టాల్లో కూరుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. డబ్బుల ట్రాన్స్ ఫర్ గుట్లన్నీ ఆయన చెబితే.. కేసు మొత్తం వీడిపోతుంది. నగదు లావాదేవీలు జరిగాయని తేల్చితే.. కేసును త్వరగా ముగిస్తారు. బుచ్చిబాబు వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. అయితే బుచ్చిబాబు అప్రూవర్ గా మారరని ఆయన పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలంటున్నారు.
గతంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారారని ప్రచారం చేసి చాలా కాలం పాటు అరెస్టు చేయలేదని.. ఆయన అప్రూవర్ గా మారకపోవడంతో అరెస్టు చూపించారని అంటున్నారు. తాను కవిత బినామీనని ఆయనతో తీసుకున్న స్టేట్ మెంట్ ను కూడా … వెనక్కి తీసుకునేందుకు ఆయన పిటిషన్ వేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కవిత కాలు ఫ్రాక్చర్ కావడతో బెడ్ రెస్టులో ఉన్నారు. ఆమె ఈడీకి ఇచ్చిన పది ఫోన్లను అధికారులు వడబోశారు. తర్వాత ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.