ఖూనీ కేసు డైవర్షన్ – అచ్చెన్నాయుడు కుటుంబంలో అరెస్టులు!

ఏపీలో రాజ్యాంగం ఉందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓ వైపు వైసీపీ నేతల అరాచకాలు కళ్ల ముందు కనిపిస్తూంటే చర్యలు తీసుకోరు కానీ.. అసలు ఫిర్యాదులే లేని కేసుల్లో టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. సొంత బాబాయ్ వివేకాను ఖూనీ చేసిన కేసులో సీబీఐ ప్రధాన నిందితుడని ఆరోపిస్తున్న అవినాష్ ను కాపాడటానికి కిందా మీదా పడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ నేతలపై మాత్రం అసలు ఫిర్యాదుల లేకుండానే సీఐడీని ఉసిగొల్పి అరెస్టులు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అని భయంభయంగా ఉంటూ… అచ్చెన్నాయుడు ఫ్యామిలీలోని కీలక వ్యక్తుల్ని సీఐడీతో అరెస్ట్ చేయించారు.

ఎర్రన్నాయుడు కుమార్తె అదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసుతో పాటు మామ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చిట్ ఫండ్ వ్యాపారం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వారిని సీఐడీ తీవ్రంగా వేధించడంతో ఆదిరెడ్డి భవాని ఓటింగ్ కు రాకుండా వె్ళ్లిపోయారు. అయితే అచ్చెన్నాయుడు వెళ్లి నచ్చ చెప్పి తీసుకు వచ్చారు. ఆ చిట్ ఫండ్ కంపెనీపై ఎలాంటి ఫిర్యాదులు ఖతాదారులు చేయకపోయినా వారే సోదాలు చేసి అక్రమాలు ఉన్నాయని కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేశారు.

సీఐడీ పోలీసులు ఇప్పటికే మార్గదర్శి విషయంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అన్నిచట్టాల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో కక్ష సాధింపు అరెస్టులో భాగమయ్యారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీలో చేరలేదనే బీసీ కుటుంబాన్ని వేధిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.ఓ వైపు ముఖ్యమంత్రి కుటుంబమే తీవ్రమైన ఖూనీ కేసుల్లో ఉంటే.. మరో వైపు ప్రతిపక్ష నేతల అరెస్టులు ప్రజాస్వామ్యంపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close