భారత రాష్ట్ర సమితి రెండో విడత ప్రభుత్వంలో చేయాలనుకున్న టాస్కులన్నింటినీ కేసీఆర్ పూర్తి చేసేశారు. మొదటి విడతలో ప్లాన్ చేశారు. ప్రారంభించారు. రెండో విడతలో నాలుగున్నరేళ్లకు అన్నీ పూర్తి చేసేశారు. ఇప్పుడు కేసీఆర్ పని తీరు కళ్ల ముందే ఉంది. కొత్త సచివాలయంతో తాను అనుకున్న కీలకమైన పనులు..కళ్ల ముందు కనిపించే అభివృద్ధిని కేసీఆర్ ప్రజలకు చూపించారు.
అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్‌లో కనీసం 40 ఫ్లైఓవర్లు నిర్మించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్,టీ వర్క్స్, టీ హబ్ ప్రారంభించారు. ఒక్క సంవత్సరంలో ఒకే రోజు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మల్లన్న సాగర్ ను రంభించారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ను శరవేగంగా నిర్మాణం అవుతోంది. 12 వందల 80 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్ నిర్మించింది ప్రభుత్వం. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే ఐటీ హబ్ మైండ్ స్పేస్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మాణాలు చేస్తోంది.
తాను ఏం చేశానో ఏం చేయగలనో.. కేసీఆర్ ప్రజల ముందు పెట్టినట్లయింది. ఇప్పుడు ప్రారంభించడానికి ఏమీ లేవు. కానీ కొత్త శంకుస్థాపనలు మాత్రం చేయవచ్చు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇబ్బందులు పడుతున్నా.. కేసీఆర్ వాటిని నేర్పుగా అధిగమించగలరు. ఇప్పుడు కేసీఆర్ .. ఎన్నికలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లనుపూర్తి చేసుకున్నట్లే. మరో నాలుగు నెలల్లో ఎన్నికలని కేసీఆర్ చెబుతున్నారు. దానికి ముందుగానే ఆయన ప్రిపేర్ అయిపోయారు. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.