తెలంగాణ ప్రథమ కుటుంబం అంటే ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, కవితలు తమకు సమయం కేటాయించడమే లేదని ఒక సీనియర్ మాజీ ఎంపి వాపోయారు. వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయరని, తీసినా సమయం ఇవ్వరని ఆయన చెప్పారు. ఎప్పుడైనా పొరబాటున తీసినా అంకుల్ మళ్లీ ఫోన్ చేస్తా అంటారు. లేదంటే అలా మెసేజ్ పెడతారు. దాన్ని వారికి గుర్తు చేద్దామంటే మళ్లీ స్పందన వుండదు. ఇక ముఖ్యమంత్రి గారైతే సమయం ఇవ్వడమనేది అస్సలు జరగదు. మా లాటి సీనియర్లం కూడా మెసేజ్లు మెయిళ్లపై ఆధారపడవలసి వస్తున్నది అని ఆయన విచారం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ రావడానికి , రాష్ట్ర సాధనకు కూడా మా మద్దతు ఉపయోగపడింది. కాని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా మా వంటివారిని అస్సలు ఆదరించడం లేదు, ఆలకించడం కూడా లేదు . వారి మనసులో వుంటే క్షణాల మీద నిర్ణయాలు నియామకాలు జరిగిపోతున్నాయి మా వంటి వారి పరిస్థితి మాత్రం చెప్పుకోలేనంత దారుణంగా దయనీయంగా వుంది అని అన్నారాయన.