జగన్ను విపక్ష నేతలు విమర్శిస్తే ప్రజల్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే వారు విపక్ష నేతలు కాబట్టి విమర్శిస్తారు. అదే సొంత నేతలు .. పరోక్షంగా జగన్ ను పిచ్చోడు, క్రాక్ అని జనంతో అనిపిస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిసి మాట్లాడతో తెలియక మాట్లాడతారో కానీ ఆయన శ్రీకాకుళంలో ఎప్పుడు ప్రసంగించినా ఆయన జగన్ ఇమేజ్ ను పిచ్చోడు, క్రాక్ రేంజ్లోనే ఉంచుతున్నారు.
ఇటీవలి కాలంలో ఆయన ఓటర్లను బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరంతా సైకిల్ గుర్తు మాయలో ఉన్నారని నేరుగానే అంటున్నారు. తాజాగా ఆయన జగన్ ను సైకో, క్రాక్ అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ను పిచ్చోడు, క్రాక్ అంటున్నారని .. మీకు ఇష్టముంటే ఓటేయండి లేకపోతే మానేయండి అంతే కానీ సీఎం జగన్ ను ఇలా అంటారా అని జనంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిచ్చోడు , క్రాక్ అని జనం ఎప్పుడు అన్నారో.. ధర్మాన ఎప్పుడు విన్నారో కానీ.. అందరూ అదే అనుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం బల్ల గుద్ది చెప్పినట్లయింది.
అది కూడా దర్మాన మాటలు ఎలా ఉంటాయంటే.. జనం అంతా జగన్ ఖాతాల్లో వేస్తున్న డబ్బులతోనే బతుకుతున్నారన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పన్నుల పేరుతో బాదేసి.. తమకు అరకొరగా ఇస్తూ అదేదో గొప్పగా చెప్పి.. తమను మభ్య పెడుతున్నారని అంటున్నారు. ధర్మాన ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా .. ఆయన నోటి వెంట జగన్, సైకో, క్రాక్, పిచ్చోడు అనే మాటలు నాలుగైదు సార్లు వస్తున్నాయి. ఆయన మాటలు వైసీపీలో చర్చనీయాంశమవుతున్నాయి.