ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేస్తే దాన్ని మోసం అంటారు. అదే అధికారంలోకి రాగానే శంకుస్థాపన చేస్తే దాన్ని నిజాయితీ అంటారు అని.. “ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడి”గా గుర్తింపు తెచ్చుకున్న సీఎ జగన్ రెడ్డి అమృత వాక్యాన్ని నాలుగేళ్ల కిందట కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసినప్పుడు చెప్పారు. ఆ స్టీల్ ప్లాంట్కే మరోసారి శంకుస్థాపన చేశారు కానీ.. దాన్ని కట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన .. ఎన్నికలకు ముందు… శంకుస్థాపనల కోసం హడావిడి చేస్తున్నారు.
పదిహేను రోజలకో శంకుస్థాపన – ఫుల్ పేజీ గ్రాఫిక్స్
సీఎంజగన్ ప్రతి పదిహేను రోజులకు ఓ శంకుస్థాపన పెట్టుకుంటున్నారు. ఆ శంకుస్థాపన ఖర్చు బడ్జెట్ కనీసం రూ. పది కోట్లు ఉంటుంది. అందులో సగం పేపర్ ప్రకటనలుకు వెళ్తుంది. మిగతా సగం ఆయన బహిరంగసభ… జనాల తరలింపు.. పరదాలకు ఖర్చు అవుతుంది. చేసే శంకుస్థాపనల ప్రాజెక్టు కోసం ఆ మాత్రం అయినా నిధులు కేటాయిస్తారా అన్నది సందేహమే. ఇప్పటికే శ్రీకాకుళంలో పోర్టుకు శంకుస్థాపన చేశారు. బోలెడన్ని మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. ఇలా చాలా పరిశ్రమలకు భూమి పూజ చేశారు. కానీ ఒక్కటంటే ఒక్కటయినా కడుతున్నారా అంటే డౌటే. ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన ఉద్దానంలో ఓ చిన్న ఆస్పత్రి భవన నిర్మాణం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు.
కొత్తవేమీ కాదు.. పాత వాటికే శంకుస్థాపనలు !
ఇంకా ఇందులో విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకూ చేస్తున్న శంకుస్థాపనలు.. చేయబోయేవి అన్నీ పాతవే. ఒక్కటంటే ఒక్కటీ కొత్తది కాదు. బోగాపురంగా ఐదేళ్ల కిందటే శంకుస్థాపన జరిగింది. ఇన్నాళ్లు ఆపి ఇప్పుడు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్.. రెండు సార్లు చేసిన కడప స్టీల్ ప్లాంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే పోర్టులు.. సహా అన్నింటికీ చంద్రబాబు శంకుస్థాపన చేశారు. టెండర్లు ఖరారయి పనులు కూడా జరుగుతున్న సమయంలో జగన్ వచ్చి ఆపేసి మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారు. ఇలా గతంలో చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పెద్దకా ఖర్చు కానీ కృష్ణాజిల్లాలో వేదాద్రి ప్రాజెక్టు దుస్థితి తెలుసుకుంటే.. జగన్ తీరుపై ప్రజలు విరక్తి చెందుతారు.
జగన్ చెప్పిన మాటలే ఆయన నిజస్వరూపం !
ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు ప్రజల్ని మోసం చేయడమేనని జగన్ చెబుతూంటారు. ఇప్పుడు ఆయన చేస్తున్నది అదే. ఈ నాలుగేళ్లలో ఆయనేమైనా కట్టి ఉంటే జనం నమ్మేవారేమో. జీతాల కోసమే ఆర్బీఐ వద్ద అప్పుల కోసం పరుగెత్తేలా ఆర్థిక పరిస్థితిని దిగజార్చేసి.. రాష్ట్రంలో ప్రభుత్వానికిపని చేసి న ప్రతి ఒక్కరి బిల్లులూ ఆపేసి..దివాలాకు దగ్గరగా చేర్చి.. ఇవన్నీ శంకుస్థాపనలు చేస్తానంటే జనం ఎలా నమ్ముతారు?