రజనీకాంత్ ‘జైలర్’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఇప్పటివరకూ ఒక్క పాట కూడా ఇవ్వలేదట. అడిగితే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నాడు. అనిరుధ్ పై బాగా విసిగిస్తాడనే పేరుంది. చాలా మంది దర్శకులు అనిరుధ్ ని సంప్రదించకపోవానికి కారణం కూడ ఇదే. రిపీటెడ్ గా కొంతమంది దర్శకులే అనిరుధ్ తో మ్యూజిక్ చేయించుకుంటారు.
జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ తీసిన డాక్టర్, బీస్ట్ సినిమాలకు అనిరుధ్ నే మ్యూజిక్ ఇచ్చాడు. అదే బాండింగ్ తో జైలర్ కి కూడా అనిరుధ్ నే పెట్టుకున్నాడు నెల్సన్. అయితే రజనీకాంత్ సినిమా కావడంతో ట్యూన్స్ త్వరగా వస్తాయని అనుకున్నాడు నెల్సన్. కానీ లాభం లేదు. ఇప్పటివరకూ ఒక్క ట్యూన్ కూడా ఫైనల్ కాలేదు. స్వయంగా రజనీకాంత్ ఫోన్ చేసిన్నప్పటికీ అనిరుధ్ నుంచి సరైన సమాధానం రావడం లేదు.
రజనీ సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు వుంటాయి.అలాంటి ట్యూన్స్ కోసం సమయాన్ని తీసుకుంటున్నాడు అనిరుధ్. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక్క పాట కూడా రాకపోవడంతో యూనిట్ లో టెన్షన్ మొదలైయింది.