‘నాంది’ తరవాత.. అల్లరి నరేష్ ఆలోచనలు మారిపోయాయి. సీరియస్ కథలవైపు సీరియస్‌గానే దృష్టి పెట్టాడు. ఇట్లు మారేడుమిల్లి నియోజక వర్గం, ఉగ్రం.. ఇలా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే `సోలో బతుకే సో బెటరు` ఫేమ్ సుబ్బుతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. ఇది కూడా నరేష్ జోనర్ సినిమా కాదు. డిఫరెంట్ కథ.
వీటితో పాటు ‘జెండా’ అనే ఓ సినిమా చేస్తున్నాడు నరేష్. ‘నాంది’ తరవాత.. ఓ రచయిత కథ చెబితే, దాన్ని నరేష్ మంచి రేటు ఇచ్చి కొనేసి తన దగ్గరే ఉంచుకొన్నాడు. ఈ సినిమాని ఈవీవీ బ్యానర్లో తీయాలన్నది నరేష్ ఆలోచన. అందుకు తగిన దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. 1980 బ్యాక్ డ్రాప్లో సాగే కథ ఇది. పొలిటికల్ టచ్‌తో సాగబోతోంది. ఇలాంటి జోనర్లో నరేష్ ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. పైగా.. ఈవీవీ బ్యానర్‌ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకురావాలని, అందుకోసం ఓ మంచి కథ కావాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఇది ‘జెండా’తో తీరబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ త్వరలో వెల్లడవుతాయి. నరేష్ `ఉగ్రం` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.