వెంకట్ ప్రభు సినిమాలు, అతని స్క్రీన్‌ప్లే.. విభిన్నంగా ఉంటాయి. రొటీన్‌కి దూరంగా ఆలోచించడం వెంకట్ ప్రభు మార్క్. అదే అతనికి విజయాల్ని కట్టిపెడుతోంది. తను తొలిసారి తెలుగులో ఓ సినిమా చేశాడు. అదే.. `కస్టడీ`. నాగచైతన్య హీరో. మే 12న విడుదల అవుతోంది. ఈ సినిమాలో కూడా ఓ కొత్త పాయింట్ చెప్పబోతున్నాడు వెంకట్.
సాధారణంగా ప్రతీ సినిమాలోనూ.. హీరో వెంట విలన్, విలన్ వెంట హీరో పడుతుంటారు. ఒకరి అంతం మరొకరు చూడాలనుకొంటారు. విలన్ని చంపడంతోనే సినిమా సుఖాంతం అవుతుంది. హీరో మిషన్ పూర్తయ్యేది కూడా అప్పుడే. కానీ.. కస్టడీ అలా కాదు. విలన్ ని కాపాడడమే హీరో మిషన్. విలన్‌కి వచ్చే ఉపద్రవాల్ని కనిపెట్టి రక్షణ కల్పిస్తుంటాడు హీరో. అదే.. ఈ సినిమాలోని కొత్తదనం. ఈ పాయింట్‌ని చిత్ర బృందం ముందే రివీల్ చేసి.. ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసేసింది. ఈనెల 5న ట్రైలర్ రాబోతోంది. అందులో ఈ పాయింట్ ముందే చెప్పేస్తున్నార్ట. నాగచైతన్య ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. నెకల రోజుల ముందే ప్రమోషన్లు కూడా మొదలెట్టేశాడు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా అరవింద్ స్వామి నటించడం విశేషం.